విశాఖలో పెళ్లి పీటలపై వధువు సృజన మరణం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందరూ భావిస్తున్నట్లుగా సృజన మృతికి గుండెపోటు కారణం కాదని.. వధువు శరీరంలో విషపదార్థాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేల్చారు వైద్యులు. ఆమె మృతికి ఆత్మహత్య కారణంగా భావించారు. అందుకు బలాన్ని చేకూర్చేలా.. సదరు యువతి హ్యాండ్ బ్యాగ్ లో గన్నేరుపప్పు పొట్టు దొరకడం సంచలనంగా మారింది. అసలు ఆమెకు గన్నేరుపప్పు ఎలా లభించింది?. ఆమె బ్యాగ్ లో ఎందుకున్నట్లు? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పెళ్ళికి ముందురోజు ఆస్పత్రి పాలైన సృజన.. అంతముందే గన్నేరుపప్పు తిన్నదా?. తల్లిదండ్రులు అన్ని విషయాలను దాచి ఈ పెళ్లి చేయాలని చూశారా? అని అందరూ ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనప్పటికీ సృజన మరణం అందరి మనుసులను తీవ్రంగా కలిచివేస్తోంది.
సృజన ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకుందన్నది పరిశీలిస్తే..
కాగా, విశాఖపట్టణానికి చెందిన నాగోతి అప్పలారాజు, లలితల కుమారుడు శివాజికి అదే ప్రాంతానికి చెందిన ముంజేటి ఈశ్వర్ రావ్, ముంజేటి అనురాధల కుమార్తె సృజనకు కొద్దిరోజుల క్రితం పెళ్లి కుదిరింది. మధురవాడ, కాలానగర్‌లోని ద్రోణమ్‌రాజు కల్యాణ మండపంలో బుధవారం రాత్రి 7 గంటలకు పెళ్లి ముహుర్తం. పండితుల వేద మంత్రాల మధ్య జీలకర్ర బెల్లం పెట్టే ప్రక్రియ మొదలయింది. సరిగ్గా ఆ సమయంలో ఊహించని విధంగా సృజన పెళ్లి పీటలపై కుప్పకూలింది. కుటుంబ సభ్యులు కంగారుపడి ఆమెకు సపర్యలు చేశారు. ఎంతకీ పైకి లేవకపోవటంతో ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు, అప్పటికే ప్రాణం కోల్పోయినట్టు నిర్ధారించారు. మరి, సృజన మృతికి ఇష్టంలేని పెళ్లి కారణమా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. పెళ్లి ఇష్టం లేకుంటే చెప్పాలి కానీ, ఇలా ప్రాణం తీసుకోవడం కరెక్ట్ కాదని అందరూ సూచిస్తున్నారు. మరి పెళ్లి ఇష్టంలేని ఒక యువతి.. ఇలా పెళ్లి పీటలపై ప్రాణాలు తీసుకోవడం ఎంత వరకు కరెక్టో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Bride Srujana: విశాఖ పెళ్లికూతురు మృతిలో ట్విస్ట్! పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఊహించని నిజాలు!