క్షణికంలో ఆత్మహత్య చేసుకునేందుకు పురిగొల్పుతున్న కారణాలేవైనా సరే.. నిండు ప్రాణాలు బలౌతున్నాయి. ఆత్మహత్యలను సామాన్యులే ఆశ్రయిస్తున్నారంటే.. ఆ జాబితాలో సెలబ్రిటీలు అనేక మంది ఉన్నారు. నటుల నుండి వ్యాపార దిగ్గజాల వరకు.. వారి ప్రాణాలను వారే తీసుకుంటున్నారు. తాజాగా మరో ప్రముఖ వ్యక్తి.. అందులోనూ చిన్న వయస్సులో బలవర్మణానికి పాల్పడింది.
క్షణికంలో అనేక మంది ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. పిల్లలు చూడటం లేదనో, ఆర్థిక ఇబ్బందులో, లేదా మార్కులు సరిగా రాలేదని, ప్రేమించిన వ్యక్తులు మోసం చేశారనో బలవన్మరణాలను పాల్పడుతున్నారు. బతికి సాధించలేని సమస్యను సచ్చి సాధించలేమని తెలిసి కూడా ఆ వైపుగా ప్రేరేపితమౌతున్నారు. ఆత్మహత్య చేసుకునేందుకు పురిగొల్పుతున్న కారణాలేవైనా సరే.. నిండు ప్రాణాలు బలౌతున్నాయి. ఆత్మహత్యలను సామాన్యులే ఆశ్రయిస్తున్నారంటే.. ఆ జాబితాలో సెలబ్రిటీలు అనేక మంది ఉన్నారు. నటులు నుండి వ్యాపార దిగ్గజాల వరకు.. వారి ప్రాణాలను వారే తీసుకుంటున్నారు. తాజాగా మరో ప్రముఖ వ్యక్తి.. అందులోనూ చిన్న వయస్సులో బలవర్మణానికి పాల్పడ్డారు. ఆమె కైలీ స్కాట్. ఈ పేరు తెలియదు కానీ ఓ విమానాయాన సంస్థ ప్రకటనల్లో కనిపించి అబ్బుర పరిచిన ట్రాన్స్ జెండర్ అంటే గుర్తు పడతారేమో.
అమెరికాకు చెందిన ట్రాన్స్ జెండర్ ప్లైట్ అటెండెంట్ కైలీ స్కాట్ (25) యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వాణిజ్య ప్రకటనలో కనిపించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆమె మరణించడానికి ముందు సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టారు. పెట్టిన కొన్ని గంటల్లోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. కొలరాడోలోని తన నివాసంలో కైలీ గత సోమవారం చనిపోయారు. అంతకు ముందు స్కాట్ తన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పేజ్‌లో స్నేహితులు, కుటుంబసభ్యులనుద్దేశించి హృదయవిదారక నోట్ రాశారు ‘నేను నా తుదిశ్వాస తీసుకుంటూ ఈ భూమి నుండి నిష్క్రమిస్తున్న సమయంలో నేను నిరాశ పరిచిన వారికి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా.. నేను సరిగా ఉండలేకపోయినందుకు నన్ను క్షమించండి.. నేను ఇష్టపడే వారికి.. నేను ధైర్యంగా ఉండలేకపోయినందుకు క్షమించండి. నా కోసం ఎన్నో ఇచ్చిన వారికి.. నేను చేసిన ప్రయత్నం ఫలించనందుకు క్షమించండి. నా మరణానికి ఎవ్వరూ కారకులు కాదూ..నేను మంచిగా మార్చుకోలేకపోయినందుకు ఇలా చేస్తున్నా, యాష్లే, సింథియా, రెజిన్, సోఫియా నన్ను క్షమించండి. మనం పంచుకున్న మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకోండి’ అంటూ భావోద్వేగ పోస్టు పెట్టారు. .
ఫిబ్రవరి 2016లో 15 ఏళ్ల వయసులో ప్రాణాలను బలిగొన్న తన స్నేహితురాలు బ్రియానా మూర్‌ను ఉద్దేశించి, ‘బ్రియానా, నేను వస్తున్నాను’ అనే పదాలతో ఆమె నోట్‌ను ముగించింది. అయితే ఆమె పోస్టును చూసిన అనేక మంది ముందుగా పాజిటివ్ మేసేజ్ లు పంపారు. అయితే ఆమె కొన్ని గంటలకు చనిపోపోయింది. తన కుమార్తె మరణవార్తను ధ్రువీకరించిన స్కాట్ తల్లి ఆండ్రియా సిల్వెస్ట్రో, సోదరి ధ్రువీకరించారు. .. ఆమె తల్లి ఫేస్‌బుక్ పోస్ట్ చేశారు. ‘కైలీ స్కాట్.. నువ్వు నా కూతురిగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నా.. నీ నవ్వు చాలా అందంగా ఉండేది.. నీ హృదయం మాలో ఎవరికీ అర్థం కానంత పెద్దది’ అని రాసుకొచ్చారు. కాగా, స్కాట్ మరణంపై డెన్వర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, స్కాట్ మరణవార్తపై యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విచారం వ్యక్తం చేసింది. ‘‘కైలీ స్కాట్ విషాదకర మరణానికి మేము చాలా చింతిస్తున్నాం.. ఆమె కుటుంబం, స్నేహితులు, సహోద్యోగులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం’ అని ఓ ప్రకటన విడుదల చేసింది. 2020లో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వైవిధ్య ప్రచారంలో భాగంగా కైలీ స్కాట్ వార్తల్లో నిలిచారు