ఎన్ని ఘటనలు వెలుగు చూసినా.. ఎక్కడో ఒకచోట మరో బాబా పుట్టుకొస్తూనే ఉన్నాడు. ప్రజలు కూడా ఆ బాబాలను గుడ్డిగా నమ్ముతూనే ఉన్నారు. చదువుకోని వాళ్ల కంటే.. ఉన్నత చదువులు చదివిన వారే అలాంటి వారి దగ్గర ఎక్కువగా మోసపోతున్నారు. తాజాగా మరో కొత్త బాబా అకృత్యం తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. వైద్యం పేరుతో ఓ యువతిని చిత్రహింసలు గురి చేశాడు. ఆశ్రమంలోనే పెట్టుకుని ఆమెను కాలేజ్ కు కూడా వెళ్లనీకుండా అడ్డుకున్నాడు. ఆ వేధింపులు తాళలేక యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. తిరువళ్లూరు జిల్లాకు చెందిన హేమమాలిని(20) బీఎస్సీ చదువుతోంది. కొద్దిరోజులుగా హేమమాలిని కడుపునొప్పి, మెడనొప్పితో బాధపడుతోంది. దీర్ఘకాలిక సమస్యలు ఇవి అంటూ ఆమెను వైద్యం కోసం ఆస్పత్రికి కాకుండా.. ఆశ్రమానికి తీసుకెళ్లారు. తల్లిదండ్రులు యువతిని తిరువళ్లూరులోని మునుస్వామి ఆశ్రమానికి తీసుకెళ్లారు. హేమమాలినిని చూసిన మునుస్వామి ఆమెకు దోషం ఉందని చెప్పాడు. ఆమెను ఆశ్రమంలోనే ఉంచాలని.. అమావాస్య, పౌర్ణమికి పూజలు చేయాలని తెలిపాడు. అందుకు సరేనన్న తల్లిదండ్రులు యువతి వద్ద అత్త ఇంద్రాణిని ఉంచారు.
ఇదీ చదవండి: భర్త కళ్ళ ముందే భార్యకి అవమానం..! కుర్రాళ్లంతా కలిసి!
యువతిని ఆశ్రమానికే పరిమితం చేశారు. ఆమె కాలేజ్ కు వెళ్లేందుకు కూడా మునుస్వామి అంగీకరించలేదు. యువతి కోలుకోవడం ప్రధానం అనుకున్న తల్లిదండ్రులు అందుకు కూడా ఒప్పుకున్నారు. రానురాను ఆ యువతి ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. మంగళవారం హేమమాలిని అస్వస్థతకు గురైంది. విపరీతంగా వాంతులు అయ్యాయి. మునుస్వామిని కలిసి హేమమాలినిని ఆస్పత్రికి తీసుకెళ్తానని ఇంద్రాణి కోరింది. అందుకు మునుస్వామి అంగీకరించలేదు. మూలిక వైద్యం జరుగుతున్నప్పుడు అలా ఆశ్రమం నుంచి పంపడం కుదరదని చెప్పాడు.
మునుస్వామి వాదనతో విసిగిపోయిన తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. ఎలాగైనా ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. వారిని అడ్డుకోలేనని భావించిన మునుస్వామి ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అనుమతించాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా కాసేపటికే హేమమాలిని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. హేమమాలిని వైద్యం పేరుతో మునుస్వామి వేధింపులు తాళలేక పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పింది. హేమమాలిని మరణవార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చేతులారా కుమార్తెను చంపుకున్నామంటూ విలపించారు.
ఇదీ చదవండి: ప్రియుడి కోసం 2 ఏళ్ళ కూతురికి నరకం చూపించిన తల్లి!
తమ కుమార్తె మరణానికి మునుస్వామి కారణం అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మునుస్వామిని ప్రశ్నించారు. పోలీసుల విచారణలో కూడా తాను ఒక బాబా అని, మూలికలతో రోగాలకు వైద్యం చేస్తున్నాని చెబుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. వైద్యం పేరుతో ఎలాంటి మూలికలు వాడుతున్నాడు. ఎలాంటి వైద్యం చేస్తున్నాడు.. కోణంలో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. యువతికి మెడ, బాడీ పెయిన్స్ అయినప్పుడు ఒక మంచి ఫిజియోథెరపిస్ట్ దగ్గరకు తీసుకెళ్తే ఆమె బతికుండేది. తల్లిదండ్రులు తీసుకున్న తప్పుడు నిర్ణయంతో ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.