అక్రమ సంబంధంలో కూడా నైతిక విలువలు, వావివరసలు కోరుకుంటే ఎలా? నాతో అందుకు ఓకే అన్న మహిళ మరొకరితో తిరగితే తప్పేంటి? అలాంటి ఆలోచనే వచ్చుంటే ఆ వ్యక్తి మరొకరి ప్రాణాలు తీసేవాడు కాదు. తన జీవితాన్ని నాశనం చేసుకునే వాడు కాదు. తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ మరొకరితో తిరుగుతోందని తెలుసుకుని రగిలిపోయాడు. ఓరోజు అతడిపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని చిన్న ఓబినేనిపల్లెకు చెందిన శ్రీనివాసరెడ్డి తన పొలంలో పనికి వచ్చే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. రెండేళ్లుగా ఆమెతో తన కోరికలు తీర్చుకుంటూ.. ఆమెకు అవసరమైనప్పుడు డబ్బు ఇస్తూ వచ్చాడు. ఆ తర్వాత శ్రీనాథ్ రెడ్డి అనే వ్యక్తికి ఆ మహిళ దగ్గరైంది. ఆమె అవసరాల కోసం డబ్బు ఇస్తూ శ్రీనాథ్ రెడ్డి కూడా తన అవసరాలు తీర్చుకోవడం మొదలు పెట్టాడు. ఆ విషయం కాస్తా శ్రీనివాస్ రెడ్డి చెవిన పడింది.
ఆమె ఇద్దరి దగ్గర డబ్బు తీసుకుంటూ, ఇద్దరినీ సుఖపెడుతూ వచ్చింది. శ్రీనాథ్ రెడ్డి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ మహిళ తనను నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టిందని శ్రీనివాసరెడ్డి భావించాడు. నిన్నగాక మొన్నొచ్చిన వాడికి ఎందుకు అంత ప్రాధాన్యత అనే భావన మొదలైంది. తన అక్రమ సంబంధానికి శ్రీనాథ్ రెడ్డి అడ్డుగా ఉన్నాడని శ్రీనివాసరెడ్డి భావించాడు. అతని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయానికి వచ్చాడు. ఓ రోజు శ్రీనాథ్ రెడ్డి పొలంలో నీళ్లు పెడుతుండగా అక్కడికి శ్రీనివాసరెడ్డి వెళ్లాడు. అతనితో మాట్లాడుతున్నట్లు నటించి కత్తితో పొడిచాడు. కింది పడిపోయిన అతని గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.