ప్రియురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డ ప్రియుడు, మనవరాలిపై అత్యాచారానికి దిగిన 60 ఏళ్ల వృద్దుడు.. ఇలాంటి దారుణమైన ఘటనలు నేటి కాలంలో వినాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇక ఇంత కన్న దారుణమైన ఘటన ఒకటి తాజాగా కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. తల్లిదండ్రుల తర్వాత ప్రాణంగా చూసుకోవాల్సిన సొంత అన్నే చెల్లెలిపై అత్యాచారానికి దిగిన ఘటన మైసూరులో జరిగింది. వినటానికే భయంకరంగా ఉన్న ఈ వార్తలో విస్తుపోయే మరిన్ని నిజాలు మీ కోసం.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మైసూరులోని గిరిదర్శినిలో వినయ్ కుమార్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఓ తమ్ముడు ముగ్గురు చెల్లెలు ఉన్నారు. అయితే గతంలో వీరి తల్లిదండ్రుల మరణించడంతో అన్నలతో పాటే చెల్లెళ్లు ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే వినయ్ కుమార్ అనే యువకుడు మద్యానికి బానిసై జాలీగా తిరుగుతుండేవాడు. ఈ క్రమంలోనే తన సొంత చిన్న చెల్లెలిపై కన్నేశాడు. ఇక ఇంతటితో ఆగకుండా చెల్లెలిపై అత్యాచారం చేస్తూ దారుణానికి పాల్పడ్డాడు.
అలా కొంత కాలం గుట్టు చప్పుడు కాకుండా ఈ దాడికి పాల్పడ్డ ఈ దుర్మార్గుడి వ్యవహారం బయట పడింది. దీంతో పాటు ఆ బాలిక ఇప్పుడు గర్భవతి అని మరో అన్నకి తెలియడంతో ఒక్కసారిగా షాక్ గకు గురయ్యాడు. ఇక ఆగ్రహంతో ఊగిపోయి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దుర్మార్గుడు వినయ్ కుమార్ ని పోలీసులు అరెస్ట్ చేసి బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. అమ్మానాన్నలా చూసుకోవాల్సిన సొంత అన్న ఇంతటి దారుణానికి పాల్పడ్డ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.