ఎవరైనా అందమైన భార్య కావాలని కోరుకుంటారు. అందమైన భార్యకోసం కలలు కనని భర్త ఉండడేమో? కానీ, ఇతను అలాంటి వాడు కాదు. అందమైన భార్య రావడంతో అనుమానం పెంచుకున్నాడు. తరచూ ఆమెను వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టాడు. పుట్టింటికి వెళ్తే.. సర్దిచెప్పి పంపుతున్నారు. ఎంత చెప్పినా భర్త మారడని నిర్ణయించుకున్న భార్య ఊహించని నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఉరివేసుకుని ఉసురు తీసుకుంది.
ఇదీ చదవండి: వీడియో: ఆ ప్రియురాలికి కోపం వచ్చింది! ఊర కొట్టుడు!
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక బీదర్ కు చెందిన మచ్ఛీంద్రా రాథోడ్ ఏడేళ్ల క్రితం బతుకుతెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. ఏఎస్ రావునగర్ నివాసముంటున్నాడు. స్వీట్ కాన్ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కూతురు ప్రియాంకకు ఏఎస్ రావు నగర్ లోనే ఉంటున్న సచిన్ జాదవ్ తో 2020 మార్చిలో వివాహం చేశారు. వారికి 13 నెలల పాప కూడా ఉంది. కొంతకాలం బాగానే సాగిన కాపురంలో.. మనస్పర్థలు మొదలయ్యాయి. అన్యోన్యంగా ఉన్న ఆ దంపతుల మధ్య గొడవలు జరిగాయి.
సచిన్ కు భార్య ప్రియాంకపై అనుమానం మొదలైంది. ఆ అనుమానంతో ఆమెను వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టాడు. ఆ బాధను పుట్టింటి వారితో చెప్పుకొంది. కానీ, తల్లిదండ్రులు సర్దిచెప్పి పంపేవారు. సచిన్ మళ్లీ వేధింపులకు గురి చేస్తుండేవాడు. ఫిబ్రవరి 20న కూడా అలాగే ప్రియాంక పుట్టింటికి వెళ్లింది. ఎప్పటిలాగానే సర్దిచెప్పి తన సోదరుడితో అత్తింటికి పంపారు. అక్కడ సోదరుడి ముందే సచిన్ ప్రియాంకను కసురుకున్నాడు. ఆ తర్వాత తన సోదరుడు వెళ్లిపోయాడు.
ఇది కూడా చదవండి: సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! ఆ ఫోన్ కాల్ తరువాత!
ఇంటికి వెళ్లి జరిగిన ఘటన గురించి తల్లిదండ్రులకు వివరించాడు. అలా ఎందుకు వదిలేసి వచ్చావు అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే చిన్న తమ్ముడిని ప్రియాంక వద్దకు పంపారు. ఎంతసేపు తలుపుకొట్టినా.. ప్రియాంక తీయలేదు. ఆ తర్వాత కిటికీలోనుంచి చూడగా.. ప్రియాంక ఉరికి వేలాడుతూ కనిపించింది. తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లే సరికే.. ప్రియాంక ప్రాణాలు పోయాయి. తల్లిదండ్రులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
దాదాపుగా ఇలాంటి ఘటనే.. అల్వాల్ పోలీసుస్టేషన్ పరిధిలో కూడా జరిగింది. రేవతి(28) అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లికి ఆరోగ్యం బాగోలేదనే మనోవేదనతో ఇలా చేసిందని భావిస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.