ఆడపిల్లకు తన తండ్రే హీరో. ఆమెకు ఏ కష్టం వచ్చినా ఆ తండ్రే ముందుండి కాపాడతాడు. కానీ, ఈ తండ్రి అలాంటి వాడు కాదు. కంచె చేను మేస్తే? రక్షించాల్సిన తండ్రే రాక్షసుడయ్యాడు.. కాపాడాల్సిన తండ్రే కాటేశాడు. తల్లిలేని 17 ఏళ్ల కూతుర్ని తన కామవాంఛలు తీర్చుకోవడానికి వాడుకున్నాడు. ఆఖరకు ఆమె గర్భవతి కూడా అయ్యింది. ఇలాంటి నీఛపు తండ్రిపై బాధితురాలి మేనత్త దగ్గరుండి పోలీసులకు ఫిర్యాదు చేయించింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాష్ట్రం వడోదరలో ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక తల్లి కొన్నేళ్ల క్రితం మరణించింది. ఆ బాలిక తండ్రి సంరక్షణలోనే ఉంటోంది. తల్లిలేని ఆ బాలికపై తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. తన కామవాంఛలు తీర్చుకోవడానికి ఆ బాలికను ఆట బొమ్మగా మార్చాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. ఎలా అడ్డుకోవాలో అర్థంకాదు. ఎవరితో చెబితే తండ్రి ఎలా స్పందిస్తాడో తెలియని ఆ బాలిక అలాగే ఉండిపోయింది. తన బాధను మనసులోనే దాచుకుంది.
ఆ తండ్రి అరాచకం కొనసాగుతూనే ఉంది. ఆ బాలిక అలాగే భరిస్తూనే ఉంది. కొన్నిరోజులకు ఆ బాలిక అనారోగ్యానికి గురైంది. ఆమెకు తన మేనత్త వైద్యుల వద్దకు తీసుకెళ్లింది. ఆమెను పరీక్షించిన డాక్టర్లు ఆ బాలిక 18 వారాల గర్భవతి అని తేల్చారు. ఆ వార్త విన్న మేనత్తకు నోట మాట రాలేదు. బాలికను నిలదీసింది. ఏంటి ఎలా జరిగింది? ఎవరు దీనికి కారణం అని. ఆ బాలిక చెప్పిన సమాధానం విని ఆ మేనత్త నిర్ఘాంతపోయింది. ఎందుకంటే ఆ దారుణానికి ఒడిగట్టింది స్వయాన తన సోదరుడే. ఆ వార్త విని తేరుకున్న ఆ మహిళ బాలికను తీసుకుని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. తన సోదరుడిపై బాలికతో ఫిర్యాదు చేయించింది. నిందితుడైన తండ్రిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: కుర్రాడితో భార్య రొమాన్స్! పాడు పని చేస్తూ బుక్ అయ్యింది!
ఛీఛీ ఇలాంటి తండ్రి కూడా ఉంటాడా? తండ్రి అనే పదానికి కళంకం తెచ్చాడు.. అంటూ బాలిక మేనత్త కుమిలిపోయింది. 2021 నుంచి తండ్రి తనపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఆ బాలిక మేనత్తకు తెలిపింది. ఇన్నాళ్లు తనలో దాచుకున్న బాధను మేనత్తతో పంచుకుంది. తల్లిలేని కుమార్తెను కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన తండ్రే ఇలాంటి దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా కలకలం రేపింది. ఇలాంటి దుర్మార్గులు కూడా ఉంటారా? ఇలాంటి కిరాతకులను ఎలా శిక్షించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.