కొందరు స్థానికంగా ఉండే నాయకులు అధికార మదంతో విర్రవీగుతుంటారు. అమయాకులపై అన్యాయంగా దాడులకు పాల్పడుతుంటారు. తాజాగా వికారాబాద్ లో అలాంటి ఘటన ఒకటి జరిగింది. వికారాబాద్ జిల్లా పులుమామిడిలో పొలం వద్ద ఒంటరిగా ఉన్న వృద్ధ దంపతులపై ఆ గ్రామ ఎంపీటీసీ భర్త దాడికి పాల్పడ్డాడు. కర్రలతో ఆ దంపతులను చావబాదినాడు. 3.5 ఎకరాల పొలం అమ్మాలంటూ యాదయ్యను ఎంపీటీసీ భర్త రామకృష్ణారెడ్డి ఒత్తిడి చేశారు. అయితే పొలం అమ్మేందుకు యాదయ్య నిరాకరించాడు.
దీంతో రామకృష్ణారెడ్డి.. యాదయ్య ఇంటికి వెళ్లి మరి దాడి చేశారు. కర్రలతో యాదయ్య, ఆయన భార్యను కృష్ణారెడ్డి కొట్టాడు. వృద్ధులని కూడా చూడకుండా విచక్షణ రహితంగా కర్రలతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆ దంపతులను వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.గతంలోనూ రామకృష్ణారెడ్డి పలువురిపై దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తోన్నాయి. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డైనా పోలీసులు పట్టించుకోలేదనే వాదనలు వినిపిస్తోన్నాయి. రామకృష్టారెడ్డిపై ఫిర్యాదు చేసిన వారి మీదే తిరిగి కేసు పెట్టి పోలీసులు జైలుకు పంపుతున్నారని కొందరు ఆరోపించారు.