నేటికాలంలో కొందరు అక్రమ సంపాదన కోసం అనేక అడ్డదారులు తొక్కుతున్నారు. ఎదుటి వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని కొందరు డబ్బులు దండుకుంటున్నారు. ఇలా మోసం చేసే వారిలో కొందరు ఆడవాళ్లు సైతం ఉన్నారు. తాజాగా ఓ మహిళ.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న యువతులను, మహిళలను టార్గెట్ గా చేసుకుని మోసాలకు పాల్పడింది. అప్పులు ఇచ్చి అధిక వడ్డీలు వసూలు చేస్తుంది. అప్పులు చెల్లించని వారిని స్పా సెంటర్లలో మసాజ్ చేయించి.. తన ఖజానాను నింపుకునేది. శ్రీ లీల అనే విజయవాడకు చెందిన మహిళ.. అమాయకపు యువతులను స్పా సెంటర్లో ఉంచి చేయకూడని పనులు చేయించింది. వివరాల్లోకి వెళ్తే..
ఆపదలో ఉన్న యువతులను గుర్తించి..వాళ్లకు అప్పుల రూపంలో డబ్బులు ఇచ్చి.. శ్రీ లీల పనులు చేయించునేది. పైకి మాత్రం అంత సహృదయంతో చేస్తున్నట్లు శ్రీ నటించేది. అయితే ఇచ్చిన అప్పులకు అధిక వడ్డీలు వసూలు చేస్తుంది. అప్పులు తీర్చలేని వారిని అసాంఘిక కార్యకలాపాల్లో బంధీలను చేస్తుంది. బాధిత యువతులతో మసాజ్ లు చేయించి తన ఖజానాను నింపుకుంటుంది. పేరులో శ్రీ తగిలించుకున్న సదరు మహిళ ఇప్పుడు విజయవాడలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఉండేది విజయవాడ నగర శివారు ప్రాంతంలో, కానీ ఆమె నడిపించే ఈ స్పా సెంటర్లు మాత్రం నగరం నడిబొడ్డున ఉన్నాయి. డ్యాన్స్ లు చేసి.. ఆ వీడియోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ అందరిని ఆకట్టుకుంది. డబ్బులను ఏరగా వేసి యువతుల జీవితాలతో ఆటలాడుతుంది.
శ్రీ వద్ద అప్పులు తీసుకున్న పాపానికి పలువురు మహిళలు, యువతులు బంధీలుగా మారారు. డబ్బులు తీసుకున్న వారు అధిక వడ్డీలు చెల్లించలేక, అప్పులు తీర్చలేక ఆమె చెప్పిన పనులు ఇష్టం లేకున్న చేస్తున్నారు. ఇక డబ్బులు తీసుకున్న యువతులతో ఆమె చేయకుడాని పనులు బలవంతగా చేయిస్తుంది. ఆమె ఉచ్చులో చిక్కుకున్న యువతులు శ్రీ చెప్పే పనులు చేయలేక తప్పించుకోలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. శ్రీ లీల.. చెప్పినంత వడ్డీ చెల్లించలేమనే వారిపై వేధింపులకు పాల్పడుతుంది. తీసుకున్న మొత్తం వడ్డీతో సహా ఒక్కేసారి చెల్లించాలని ఒత్తిడి చేసేది. స్పా కేంద్రలో పనిచేసే వారు ఇష్టం లేకున్న, పని మానేస్తామన్న వారికి ఇదే పరిస్థితి. ఇలా యువతులను, మహిళలను తన స్పా కేంద్రాల్లో బంధీలుగా చేసింది. వారితో మసాజ్ చేయించి వేలకు వేలు దండుకుంటుంది.
శ్రీ చేసే అరాచాకాలను భరించలేక, ఆ ఉచ్చులో ఇరుక్కున్న మహిళలు లబోదిబోమంటున్నారు. పోలీసులను ఆశ్రయించి తమ గోడును చెప్పుకున్నారు. శ్రీ కంబంద హస్తాల నుంచి విముక్తి పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీ లీలలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితల యువతులు మీడియా వేదిక పోలీసులను కోరారు. శ్రీ లీల బినామీల పేర్లతో స్పా సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇలా యువతుల అవసరాలతో శ్రీ ఆకుడుంటుంది.