తుపాకులు, కత్తులతో బెదిరించడం, దోపిడీలకు పాల్పడడం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. కొందరు తుపాకులతో బెదిరింపులకు పాల్పడుతూ హల్ చల్ చేస్తుంటారు. ఇటీవల చాలా చోట్ల కాల్పులకు ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో కొందరు మరణించగా మరికొందరు గాయాల పాలయ్యారు. గతంలో కొందరు యువకులు పట్టపగలు ఓ పండ్ల వ్యాపారిపై కాల్పులు జరిపారు. ఆ ఘటనలో ఆ వ్యాపారి తృటిలో తప్పించుకున్నాడు. తాజాగా మధ్యప్రదేశ్ లో కొందరు యువకులు అర్ధరాత్రి నడిరోడ్డుపై కాల్పులకు తెగబడ్డారు. వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్ లోని మోరినా జిల్లాలోని కొత్వాల్ పోలీస్టేషన్ పరిధిలో కొందరు యువకులు కాల్పులకు తెగబడ్డారు. రాత్రి సమయంలో బైకులపై వెళ్లి.. స్థానికంగా ఉండే ఓ వ్యాపారి ఇంటి టార్గెట్ చేశారు. ఆ యువకులు ఒకరి తరువాత ఒకరు.. ఆ వ్యాపారి ఇంటిపై కాల్పులు జరిపారు. ఆ యువకులు ఇలా వచ్చి అలా కాల్చి వెళ్లిపోయారు. మరికొందరు ఆ వ్యాపారి ఇంటిపై రాళ్లు సైతం విసిరారు. ఈ కాల్పుల సమయంలో అక్కడే ఉన్న పశువులు సైతం ఉల్కిపడ్డాయి. కొత్వాల పోలీస్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. యువకులు కాల్పులకు సంబందించిన దృశ్యలన్ని సీసీకెమెరాలో నమోదయ్యాయి.
సీసీ పుటేజి ఆధారంగా యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికి ఇలా అక్రమంగా తుపాకులను ఉపయోగించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలు తగ్గుతాయని స్థానికులు తెలిపారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.