వివాహేతర సంబంధాలే అన్యోన్యమైన భార్యాభర్తల కాపురాన్ని నిట్టనిలువునా చీల్చుతున్నాయి. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధాల్లో వేలు పెడుతూ నిండు సంసారాలను బజారుకీడ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలోనే ఓ భర్త తన ప్రియురాలితో ఇంట్లో ఏకాంతంగా ఉండగా తన భార్య ఎంట్రీ ఇవ్వడంతో సీన్ రివర్స్ అయింది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఛత్తీస్‌గఢ్‌లోని కొండాగావ్‌కు చెందిన ఓ వ్యక్తి(25)కి గతంలో ఓ మహిళతో వివాహం జరిగింది. కొంతకాలం పాటు భార్యాభర్తల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అయితే ఈ క్రమంలోనే భర్త బుద్ధి వక్రమార్గంలోకి వెళ్లింది. స్థానికంగా మరో యువతి(19)తో భర్త వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక సమయం దొరికినప్పుడల్లా భర్త తన ప్రియురాలిని ఏకంగా ఇంట్లోకి తెచ్చుకుని తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే గత శనివారం భార్య(23) ఊరెళ్లిందనుకున్నాడు. ఇక ఇదే మంచి సమయం అనుకున్న భర్త ఎంచక్కా తన ప్రియురాలిని ఇంటికి పిలిపించుకుని బెడ్ రూంలో దుకాణం పెట్టేశాడు. కట్ చేస్తే భర్త ప్రియురాలితో ఇంట్లో ఉండగా భార్య సడెన్ గా ఎంట్రీ ఇచ్చింది.
భర్తను ప్రేయసితో బెడ్ రూంలో చూసిన భార్య ఒక్కసారిగా షాక్ కు గురైంది. కోపంతో ఊగిపోయిన భార్య… భర్తను, ప్రియురాలిని నగ్నంగా రోడ్డుపైకి లాక్కొచ్చింది. ఇక అంతటితో ఆగకుండా గ్రామస్థుల సాయంతో బట్టలు లేకుండా అర్ధనగ్నంగా ఇద్దరినీ ఊరంతా తిప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయన భార్యతో పాటు పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.