పైన ఫొటోలో ఏం తెలియనట్టు కనిపిస్తున్నవ్యక్తి పేరు జైనుల్లబుద్దీన్. నకిలీ బాబాగా అవతారమెత్తిన ఇతగాడు ఎంతో మంది మహిళలను మోసం చేశాడు. అంతేకాకుండా మరో దారుణానికి కూడా పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే
ఇతగాడి పేరు జైనుల్లబుద్దీన్. స్థానికంగా నకిలీ బాబాగా అవతార మెత్తిన ఈ కంత్రిగాడు ఎందరో అమాయక మహిళలను తన మైకంలోకి లాగేసుకునేవాడు. ఇక ఎన్నో కల్లబొల్లి మాటలతో నమ్మించి ఎంతో మంది మహిళలను, ఆర్థికంగా, శారీరకంగా మోసం చేశాడు. నగ్నంగా పూజలు చేస్తే కనకవర్షం కురుస్తుందని, రోజంతా తనతో గడిపితే డబ్బులకు డోకా ఉండదన్నాడు ఎన్నెన్నో చెప్పాడు. అంతే కాకుండా అందమైన మహిళలు వచ్చినప్పుడు పుట్టుమచ్చలు ఆధారంగా జాతకాలు చూస్తానంటూ నమ్మించాడు.
ఇలా ఎన్నో రకాల మాయమాటలతో నమ్మించి మహిళలను నగ్నంగా పూజల పేరుతో వీడియోలు తీసుకునేవాడు. ఇలా ఎంతో మంది మహిళలను మోసం చేస్తూ గలీజ్ దందాకు శ్రీకారం చుట్టి ఇటీవల అడ్డంగా దొరికిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అందరూ ఈ దుర్మార్గుడికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పజెప్పారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
తెలంగాణలోని జడ్చర్ల ప్రాంతంలో జైనుల్లబుద్దీన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. నకిలీ బాబాగా అవతారమెత్తి ఈ కేటుగాడు అందమైన మహిళలనే టార్గెట్ గా చేసుకుని ఎన్నో పాడు పనులకు తెర లేపాడు. ఫలానా పూజలు చేస్తే మీ దరిద్రం అంతా పోయి అదృష్టం వస్తుందని, పుట్టుమచ్చలు ఆధారంగా జాతకాలు చూస్తానని చెప్పాడు. ఇలా ఎంతో మంది మహిళలను నమ్మించి నగ్నంగా పూజల పేరుతో వీడియోలు తీసుకునేవాడు.
అలా తీసుకున్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి వారి నుంచి డబ్బులు గుంజినట్లు కూడా బాధితులు వాపోయారు. ఈ నకిలీ గలీజ్ దందా వెలుగులోకి రావడంతో కొందరు స్థానికులు అతడి పాడుపనులను ప్రశ్నించారు. ఈ క్రమంలో ఈ దుర్మార్గుడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఆ నకిలీ బాబాను స్థానికులంతా చితకబాది చివరికి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నకిలీ బాబా గలీజ్ దందాపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.