పొన్‌దేవి కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె డబ్బుకోసం చాలా మంది మగాళ్లను పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు తేలింది. చివరకు 8500 రూపాయలు చోరీ చేసి దొరికిపోయింది..
ఆమె పేరు పొన్‌దేవి.. పొన్‌దేవి గురించి తెలిసిన జనాలు ప్రస్తుతం ఆమెను పెళ్లిళ్ల దేవి అని పిలుస్తున్నారు. ఎందుకంటే.. ఆమె డబ్బుకోసం పదుల సంఖ్యలో మగాళ్లను పెళ్లి చేసుకుని మోసం చేసింది. పెళ్లిళ్లు చేసుకోవటం.. వారి దగ్గరినుంచి బంగారం, డబ్బు దోచుకుని వెళ్లిపోవటం ఇది ఆమె పని. వంద గొడ్లు తిన్న రాబందు కూడా ఒక్క గాలివానతో చచ్చిపోయిందన్నట్లుగా. ఎంతో మంది మగాళ్లను మోసం చేసిన పొన్‌దేవి 8500 రూపాయలు చోరీ చేసి దొరికి పోయింది. ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడులోని తేనీ జిల్లాలోని కంపమ్‌కు చెందిన పొన్‌దేవి అమాయకులైన మగాళ్లను ట్రాప్ చేసేది.
వారిని నమ్మించి పెళ్లి చేసుకునేది. పెళ్లి అయిన కొన్ని రోజులకు వారి భర్త ఇంట్లోని డబ్బు నగలతో పరారయ్యేది. ఇలా చాలా మంది మగాళ్లను పెళ్లి చేసుకుని మోసం చేసింది. పశుపతిపాళ్యానికి చెందిన విగ్నేశ్వరన్ అనే వ్యక్తిని కూడా పెళ్లి చేసుకుంది. పెళ్లయిన కొన్ని రోజులకు భర్తకు చెందిన 8500 రూపాయల్ని చోరీ చేసి తీసుకెళ్లిపోయింది. భార్య కనిపించకపోవటంతో విగ్నేశ్వరన్ శివకాశి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. చాలా రోజుల నుంచి తన భార్య కనిపించటం లేదంటూ కేసు పెట్టాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పొన్‌దేవి డబ్బులకోసం మగాళ్లను పెళ్లి చేసుకుని మోసం చేస్తోందని తేలింది. తాను మోసం చేసి తెచ్చిన డబ్బులను తన భాగస్వాములు అయిన బాల మురుగన్, అమృతవల్లిలతో పంచుకునేది. పోలీసుల విచారణలో కార్తీక్ అనే వ్యక్తి ఆమె మొదటి భర్తగా తేలింది. ఈ కేసుకు సంబంధించి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టు ఎదుట హాజరుపరిచారు. మరి, డబ్బు కోసం మగాళ్లను పెళ్లి చేసుకుని మోసం చేస్తున్న పొన్‌దేవి ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.