ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడి పేరు ప్రభాకరన్. ఇతడు 200 మంది మహిళల ముందే హద్దులు దాటి సిగ్గు లేకుండా ప్రవర్తించాడు. ఒంటిపై బట్టలు లేకుండా ఏం చేశాడో తెలుసా?
తమిళనాడులో ఓ యువకుడు బరితెగించి ప్రవర్తించాడు. అందరూ చూస్తున్నారన్న సోయి, సిగ్గు లేకుండా పాడుపనికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని చూడలేని 200 మంది మహిళలు తలలు తప్పుకున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నీచుడిని కఠినంగా శిక్షించాలంటూ మహిళలు అంతా రోడెక్కి ఆందోళన చేపట్టారు. ఇక పోలీసులు స్పందించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడు తిరువళ్లూరు జిల్లా పుల్లారంబాక్కం గ్రామంలో ప్రభాకరన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇదే గ్రామానికి చెందిన దాదాపు 200 మంది మహిళలు ఇటీవల ఉపాధి హామీ పనులకు వెళ్లారు. వీరితో పాటు ప్రభాకరన్ కూడా వెళ్లాడు. అయితే ప్రభాకరన్ అప్పటికే ఫుల్ గా మద్యం సేవించి అక్కడికి వెళ్లాడు. అంతేకాకుండా ఆ 200 మంది మహిళల ముందు ప్రభాకరన్ బరితెగించి ప్రవర్తించాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో అర్థం ఒంటిపై బట్టలు విప్పి వారి ముందు అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇతడి దారుణాన్ని చూడలేని ఆ మహిళలు తలలు పక్కకు తిప్పుకున్నారు.
ఇక మహిళలు అందరూ ఇతడికి గట్టిగా బుద్ది చెప్పాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. ఇలా అయితే కాదని భావించిన ఆ మహిళలు అంతా.. ఏకంగా రోడ్డెక్కి అతన్ని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. వీరి నిరసనతో స్పందించిన పోలీసులు.. ఎట్టకేలకు ప్రభాకరన్ ను అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 200 మంది ఆడవాళ్ల ముందు ఒంటిపై బట్టలు లేకుండా అసభ్యకరంగా ప్రవర్తించిన ఇతడి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.