ఇతని పేరు విఘ్నేష్. డిగ్రీ వరకు చదువుకున్న ఈ యువకుడు ప్రభుత్వ కొలువు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇతడు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న తరుణంలోనే ఇతడికి ఓ అమ్మాయి పరిచయం అయింది. వీరిద్దరి పరిచయం రాను రాను ప్రేమగా మారింది. దీంతో ఒకరి మనసులు ఒకరు నచ్చుకోవడంతో ఇద్దరూ ప్రేమించుకున్నారు. చివరికి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ ఆ విషయంలో మాత్రం భర్తకు భార్యపై ఎప్పుడూ అనుమానం ఉండేది. అయితే భార్యపై అనుమానంతో భర్త దారుణానికి తెగించాడు. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడులోని కఢలూరు జిల్లా వృధాచలం. ఇక్కడే ఓ వీధిలో నివాసం ఉంటున్న విఘ్నేష్ అనే యువకుడు డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే విఘ్నేష్ కు ఎదురింట్లో ఉండే గ్రేసియాల్ అనే కాలేజీ అమ్మాయి పరిచయం అయింది. దీంతో ఇద్దరూ అప్పుడప్పుడు కలిసి మాట్లాడుకోవడం, బయట తిరగడం చేసేవారు. కొన్ని రోజుల తర్వాత ఒకరి మనసులు ఒకరికి నచ్చడంతో చివరికి ప్రేమలో పడ్డారు. అలా వీరి ప్రేమాయణం కొన్ని రోజులు గడిచిపోయింది. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ విఘ్నేష్ తో పెళ్లికి గ్రేసియాల్ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అయినా సరే చివరికి పెద్దలను ఒప్పించి మరీ వివాహం చేసుకున్నారు.
ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత కూడా గ్రేసియాల్ కాలేజీకి వెళ్తూ ఉండేది. అయితే కాలేజీలో గ్రేసియాల్ యువకులతో సన్నిహితంగా ఉంటుందని భర్త విఘ్నేష్ తరుచు భార్యను అనుమానిస్తుండేవాడు. ఇదే విషయమై భర్త భార్యతో అనేక సార్లు గొడవ పడ్డాడు. దీంతో ఇతని పోరు పట్టలేక అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్తూ వస్తూ ఉండేది. అయినా విఘ్నేష్ ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాకపోగా.. తాగుడుకు బానిసయ్యాడు. రోజూ తాగొచ్చి భార్యను అనుమానంతో అనేక మాటలు తిట్టేవాడు. అయితే ఇదే విషయమై విఘ్నేష్ ఇటీవల భార్యతో మరోసారి గొడవ పడ్డాడు. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు.
ఇక కోపంతో ఊగిపోయిన భర్త భార్య గ్రేసియాల్ ను దారుణంగా హత్య చేశాడు. అనంతరం తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు గ్రేసియాల్ ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రేసియాల్ బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ తర్వాత మృతురాలి కుటుంబ సభ్యులు భర్త విఘ్నేష్ దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు విఘ్నేష్ ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. భర్త కిరాతకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.