సమాజం ఎటు పోతుందో అస్సలు అర్థం కావడం లేదు. కొందరు క్షణి సుఖం కోసం అడ్డదారులు తొక్కుతున్న ఘటనలు తీవ్ర అందోళనలు కలిగిస్తున్నాయి. ఇక ఇవి చాలవన్నట్టు కొందరు రాక్షసులు పడక సుఖం కన్న వాళ్లని సైతం వదలకుండా నోటితో చెప్పరాని, చెవితో వినరాని దారుణాలకు ఒడిగడుతున్నారు. అయితే సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ తండ్రి కన్నకూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే దుర్మార్గుడిగా మారి దారుణానికి ఒడిగట్టడం తీవ్ర కలకలంగా మారింది.
అయితే గత కొంత కాలం నుంచి అభం, శుభం తెలియని 8వ తరగతి కూతురిపై కన్న తండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భవతి అయి బిడ్డకు జన్మనిచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని వెల్లోర్ లో ఓ దంపతులకు వివాహం జరిగింది. కొంతకాలానికి వీరికి ఓ కుమార్తె, ఓ కుమారుడు జన్మించారు. కొన్ని రోజుల పాటు ఈ భార్యాభర్తలు సంతోషమైన కాపురాన్ని నెట్టుకొచ్చారు. కానీ కొన్ని గొడవల కారణంగా భార్యాభర్తలు విడిపోవడంతో కూతురు, కుమార్తె నాన్న వద్దే ఉంటున్నారు. కాగా తండ్రి స్థానికంగా ఓ చోట పనికి వెళ్లేవాడు.
ఇక భార్యలేకపోవడంతో ఒంటరిగా మారిన భర్త క్షణిక సుఖం ఆరాటపడి ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. ఏకంగా కన్న కూతురిపై కన్నేసి గత 10 నెలలుగా అభం, శుభం తెలియని ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని ఎవరికైన చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించడం మొదలు పెట్టాడు. అలా గుట్టుచప్పుడు కాకుండా ఈ దుర్మార్గపు తండ్రి కన్న కూతురని కనికరం లేకుండా రోజూ అత్యాచారం చేస్తూనే ఉండేవాడు. కొంత కాలానికి ఆ బాలికకు కడుపులో నొప్పిగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆ బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ బాలిక గర్భవతి అని తేలడంతో అంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
దీంతో వెంటనే బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ చిన్నారిని విచారించేసరికి కన్న తండ్రే ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిపింది. ఈ దారుణ విషయాన్ని విని కుటుంబ సభ్యులంతా తలలు పట్టుకున్నారు. ఈ ఘటనపై తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఫోక్సో చట్టంతో పాటు మరికొన్ని కేసులు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
మరో దారుణమైన విషయం ఏంటంటే? ఈ నెల 2న ఆ బాలిక బిడ్డకు జన్మనివ్వడం విశేషం. ఇలా కన్నకూతురిని తల్లిని చేసిన ఈ దుర్మార్గుడికి ఎలాంటి శిక్ష విధించాలో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి.