Saroor Nagar Crime: సరూర్ నగర్ పరువు హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పరువు కోసం తన భర్త నాగరాజును దారుణంగా కొట్టి చంపిన అన్నపై అశ్రిన్ నిప్పులు చెరుగుతోంది. తాజాగా, ఆమె మీడియాతో మాట్లాడుతూ… ‘‘ జైలులో ఉన్న మా అన్నతో ఐదు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇప్పించండి. నా భర్తను చంపాక పరువు దక్కిందేమో అడుగుతాను. మా నాన్న ఉండి ఉంటే ఈ ఘటన జరిగేది కాదు. మా నాన్నకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. చాలా బాగా చూసుకునేవాడు. నాన్నకు చెప్పి నాగరాజును పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అన్న మోబిన్ నాన్నను తీవ్రంగా కొట్టడంతో ఆయన నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. నాగరాజు నేను ఇంటర్‌నుంచి ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కలిసి జీవించాలని అనుకున్నాము. పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకుంటే మోబిన్ మమ్మల్ని కచ్చితంగా చంపేస్తాడని అమ్మ హెచ్చరించింది. మోబిన్ ప్రవర్తన చిన్ననాటి నుంచి క్రూరంగా ఉండేది. నాన్నను చాలా సార్లు కొట్టాడు. తమ్ముడిని ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఉండేవాడు.
నాన్న చనిపోయిన తర్వాత అతడి ప్రవర్తన పెరిగిపోయింది. హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి’’ అని వేడుకుంది. కాగా, వికారాబాద్ జిల్లా మర్పల్లికి చెందిన నాగరాజు, అశ్రిన్‌లు ఫిబ్రవరి 1న పాతబస్తీలోని ఆర్యసమాజ్లో వివాహం చేసుకున్నారు. మే 4న రాత్రి 7 గంటల సమయంలో సరూర్ నగర్ వద్ద బైకుపై వెళుతున్న నాగరాజు, అశ్రిన్‌లపై మోబిన్, మసూర్‌లు దాడికి దిగారు. నాగరాజును ఇనుప రాడ్డుతో దారుణంగా కొట్టి చంపారు. పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరి, అశ్రిన్ ఆవేదనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Andhra Pradesh: నీ కూతురు నగ్న ఫోటోలు సోషల్ మీడియాలో పెడతా.. యువతి తండ్రికి వాలంటీర్ వేధింపులు