ఈ మధ్య కొంతమంది చిన్న చిన్న విషయాలకు మానసికంగా కృంగిపోతున్నారు. తాము ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో పలు దారుణాలకు పాల్పపడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. కన్న తల్లిని కాల్చి చంపిన కేసులో ఓ యువ నటుడికి జీవిత ఖైదు విధించడంతో పాటు పద్నాలు సంవత్సరాల వరకు పెరోల్ కి కూడా అవకాశం లేకుండా తీర్పునిచ్చింది కోర్టు. వివరాల్లోకి వెళితే..
కెనడాకు చెందిన నటుడు రియాన్ గ్రాంథమ్ పలు సినిమాలు, టీవీ షోస్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కొంత కాలంగా రియాన్ గ్రాంథమ్ పై హింసాత్మక చిత్రాల ప్రభావం బాగా పడింది. రియాన్ 2020 లో తన తల్లి బార్బరా వెయిట్ గన్ తో వెనుక నుంచి కాల్చి చంపిన కేసులో పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేశారు. హత్య చేసినట్లు పూర్తి ఆధారాలు లభించడంతో నేరం రుజువైంది.. ఈ నేపథ్యంలో కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. తన తల్లిని పక్కా ప్లాన్ తో హత్య చేసినట్లు రియాన్ ఒప్పుకున్నాడు.
నటుడిగా మంచి గుర్తింపు ఉన్న రియాన్ గ్రాంథమ్ తన తల్లిని చంపినపుడు అతని వయసు 21 సంవత్సరాలు. వైలెంట్ సినిమాల ప్రభావం తనపై పడిందని.. తన తల్లిని చంపే ముందు కూడా ఒక వైలెంట్ సినిమా చూశానని రియాన్ గ్రాంథమ్ కోర్టులో ఒప్పుకున్నాడు. ఆ సమయంలో తన మానసిక పరిస్థితి బాగా లేదని.. ఏం చేస్తున్నానో తెలియని స్థితిలో చంపానని కోర్టులో చెప్పుకొచ్చాడు. హత్య జరిగిన సమయంలో పోలీసులకు అతని కారులో లోడెడ్ గన్స్ దొరికాయి. అతడు తన తల్లిని ఎందుకు చంపాడో మాత్రం వివరించలేదు.
నవమోసాలు మోసీ కనీ పెంచిన కన్న తల్లినే దారుణంగా హతమార్చినందుకు రియాన్ గ్రాంథమ్ జీవిత ఖైదు విధించడంతో పాటు 14 సంవత్సరాల పాటు పెరోల్ కూడా అవకాశం లేకుండా సంచలన తీర్పు ఇచ్చింది కోర్టు. తన సోదరుడే తల్లిని చంపినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది అతని సోదరి దియా. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.