నేటి కాలం యువత ప్రేమ పేరుతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తెలిసి తెలియని వయసులో చదువును గాలికి వదిలేసి ప్రేమా, గీమా అంటూ చెడు తిరుగుళ్లు తిరుగుతున్నారు. ఇంతటితో ఆగకుండా చిన్న వయసులోనే ఊహించని దారుణాలకు తెగబడుతున్నారు. ఇదిలా ఉంటే ఓ బాలుడు బాలికను బెదిరించి అత్యాచారం. కొన్ని రోజుల తర్వాత ఆ బాలిక గర్భవతి అని తేలడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే ఇప్పుడు తెలుసుకుందాం.
పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో ఓ బాలిక తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. అయితే అదే బాలికను వరసకు బావ అయిన ఓ బాలుడు దారుణానికి ఒడిగట్టాడు. మరదలితో స్నేహం చేసిన ఆ బాలుడు.. చివరికి కోరిక తీర్చుకోవాలనుకున్నాడు. ఇక ఇందులో భాగంగానే ఆ బాలికను బాలుడు అనేక సార్లు బెదిరించి అత్యాచారం చేశాడు. ఇంతటితో ఆగక.. ఈ విషయాన్ని ఎవరికైన చెబితే చంపేస్తానంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు.
అయితే ఇటీవల ఆ బాలిక కడుపులో నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. మీ కూతురు గర్భవతి అని తెలిపారు. వైద్యుల మాటలు విన్న ఆ బాలిక తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కూతురు ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్న తల్లిదండ్రులు కోపంతో ఊగిపోయారు. అనంతరం ఆ బాలిక తల్లిదండ్రులు బాలుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.