సమాజంలో రోజు రోజుకు ఊహకు కూడా అందని దారుణాలు జరుగుతున్నాయి. కూతుళ్లను కంటికి రెప్పలా కాపాడాల్సిన కొందరు తండ్రులే అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు ఇప్పటికీ ఎన్నో జరిగాయి. అయితే ఇటీవల ఓ తండ్రి రాక్షసుడిగా అవతారమెత్తి కిరాతకానికి పాల్పడ్డాడు. తాజాగా రాజస్థాన్ లో వెలుగు చూసిన ఈ ఘటన సభ్య సమాజం సిగ్గు పడేలా ఉంది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది రాజస్థాన్ రాష్ట్రం జోధ్ పూర్ జిల్లా ఫలోది. ఇదే ప్రాంతానికి చెందిన కైలాష్ అనే వ్యక్తికి పెళ్లై ఓ కూతురు కూడా ఉంది. కైలాష్ స్థానిక స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నాడు. అయితే భార్యా కూతురితో కైలాష్ కొంత కాలం బాగానే ఉన్నాడు. కానీ రోజులు గడిచే కొద్ది కైలాష్ తన బుద్దిని వక్రమార్గం వైపు మళ్లించాడు. కాగా కైలాష్ గత కొంత కాలం నుంచి భార్యను కొడుతూ తీవ్ర హింసకు గురి చేస్తున్నాడు. ఇటీవల సైతం భర్త తన భార్యపై మరోసారి చేయి చేసుకున్నాడు. ఇక ఇంట్లోనే ఉన్న కూతురు ఎందుకు కొడుతున్నావంటూ తండ్రికి అడ్డు చెప్పబోయింది. నాకే అడ్డు చెబుతావా అంటూ తండ్రి కైలాష్ ఒక్కసారిగా కోప్పడ్డాడు.
వెంటనే భార్య, కూతురిపై దాడికి పాల్పడ్డారు. ఇంతటితో ఆగాడా అంటే అదీ లేదు. భార్యా, కూతురు ఇద్దరినీ బట్టలు మొత్తం విప్పించి ఆరుబయట నగ్నంగా కూర్చోబెట్టారు. ఈ సీన్ స్థానిక సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో పాటు చివరికి పోలీసుల వరకూ వెళ్లింది. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇదే విషయంపై బాధితులు ఫిర్యాదు చేస్తే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.