ఈ రోజుల్లో కొంతమంది మహిళలు సొంత కాపురాన్ని పక్కకు నెట్టి పరాయి సుఖం కోసం పాకులాడుతున్నారు. ఇలా ఎంతో మంది మహిళలు పది నిమిషాల పడక సుఖం కోసం కట్టుకున్నభర్తకు మస్కా కొట్టి ప్రియుడికి జై కొడుతున్నారు. సరిగ్గా ఇలాగే చేయబోయిన ఓ మహిళకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు గ్రామస్తులు. ప్రియుడితో పాటు ఉన్న మహిళను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చెట్టుకు కట్టేసి వీర బాదుడు బాదారు. తాజాగా రాజస్థాన్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది రాజస్థాన్ బన్స్వరా జిల్లా ఘటోల్. ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో ఓ మహిళకు గతంలో పెళ్లైంది. కొంత కాలం పాటు ఈ దంపతుల కాపురం బాగానే సాగింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆమె బుద్దిని వక్రమార్గంలోకి మళ్లించి పరాయి వ్యక్తిపై మనసు పారేసుకుంది. అయితే ఇదే గ్రామానికి చెందిన ఓ పెళ్లికాని యువకుడితో ఆ వివాహిత ఎంచక్కా వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. దీంతో వీలు కుదిరినప్పుడల్లా భర్తకు తెలియకుండా ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ ఉండేది. ఇదిలా ఉంటే ఇటీవల భర్తకు తెలియకుండా ఆ వివాహిత ప్రియుడితో పాటు స్థానికంగా ఉన్న ఓ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లింది.
ఇలా ఆ మహిళ ప్రియుడితో పాటు ఉండగా గ్రామస్థులు కొందరు గమనించారు. వెంటనే ఆ మహిళ భర్త కుటుంబ సభ్యలుకు సమాచారం అందించి మహిళతో పాటు ఆమె ప్రియుడిని ఇంటికి తీసుకొచ్చి చెరో చెట్టుకు తాళ్లతో కట్టేశారు. అనంతరం ఇద్దరిని విచక్షణారహితంగా కొట్టి తీవ్రంగా దాడి చేశారు. ఇలా వారిపై దాడి చేస్తుండగా కొందరు యువకులు వీడియోలు తీసి సోషల్ మీడియోలో పోస్ట్ చేశారు.
ఆ వీడియోలు వైరల్ గా మారి చివరికి పోలీసుల వరకు వెళ్లాయి. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు వారిని కొట్టిన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. యువతి, యువకుడి విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇలా కట్టుకున్న మొగుడికి మస్కా కొట్టి ప్రియుడికి జైకొట్టిన ఈ భార్య తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
राजस्थान के बाँसवाड़ा में एक महिला के साथ अत्याचार की पराकाष्ठा देखिए @priyankagandhi जी
यही है लड़की हूँ लड़ सकती हूँ ? pic.twitter.com/JnGA9Ynj6R
— Laxmikant bhardwaj (@lkantbhardwaj) July 30, 2022