ఈ మద్య చాలా మంది ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. హాయిగా కాపురం చేసుకుంటున్న సమయంలో చిన్న చిన్న కలతలు రావడం.. వివాహేతర సంబంధాల వల్ల ఒకరిపై ఒకరు ద్వేశం పెంచుకుంటు విడాకులు తీసుకొని విడిపోతున్నారు. కొంత మంది అయితే ప్రేమించిన వ్యక్తి అని కూడా చూడకుండా సుపారీ ఇచ్చి మరీ చంపించేస్తున్నారు. పెద్దలను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకొని మోసపోయిన మహిళలు తమ బాధ ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి ఘటనే రాజస్థాన్ లో జరిగింది.
ప్రేమకు అంతరాలు లేవని ఎంతో మంది ప్రేమికులు నిరూపించారు. తమకన్నా తక్కువ వయసు ఉన్నవారు.. రంగూ రూపు లేకున్నా.. ఆస్తీ అంతస్తు లేకున్నా ఏవీ పట్టించుకోకుండా నచ్చిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. పద్నాలు సంవత్సరాల క్రితం జైపూర్ లో ఒక మహిళ బ్యాంగ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం కోచింగ్ సెంటర్ కి వెళ్లేది. ఆ సమయంలో కోచింగ్ సెంటర్ కి వాటర్ క్యాన్ తీసుకు వచ్చే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.
పట్టుదలతో చదవి ఎగ్జామ్ పాసైన ఆ మహిళ బ్యాంగ్ లో ఉద్యోగం సంపాదించుకుంది. అతి తక్కువ కాలంలో ఆమె మేనేజర్ స్థాయికి వెళ్లింది. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో ఎంతో హ్యాపీగా కాలం వెల్లదీస్తుంది. వీరికి ఐదేళ్ల పాప కూడా ఉంది. ఇటీవల ఆమె భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడన్న వార్త తెలుసుకున్న ఆమె తల్లడిల్లిపోయింది. తన భర్తకు ఎంత చెప్పినా మనసు మార్చుకోకపోవడంతో మనో వేధనకు గురైంది.
తరుచూ ఇద్దరి మద్య గొడవలు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న మహిళ కుటుంబ సభ్యులు ఆమె చావుకు కారణం భర్తే అంటూ ఆరోపణలు చేశారు. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు భర్తపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.