తెల్లారితే పెళ్లి.. ఇంట్లో బంధువులంతా చేరి ఎవరి పనుల్లో వారు తెగ బిజీగా ఉన్నారు. అయితే కొన్ని గంటల్లో పెళ్లి పీటలెక్కనున్న యువతి దేవునికి మొక్కుతీర్చుకునేందుకు తల్లితో కలిసి గుడికి వెళ్లింది. మరికొన్ని గంటల్లో పెళ్లి కూతురుగా ముస్తాబవ్వాల్సిన ఆ యువతిని మృత్యువు ఊహించని రీతిలో పలకరించింది. తాజాగా పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లాలోని చిలకలూరి పేటకు చెందిన రాచుమల్లు సాయిలక్ష్మి స్థానిక బీఎస్ఎన్ఎల్ లో ఆధార్ సెంటర్ లో ఉగ్యోగం చేస్తుంది. అయితే ఈ యువతి తల్లిదండ్రుల పెళ్లి చేయాలని భావించి చీమకుర్తి మండలానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి నిశ్చయించారు. కాగా పెళ్లి బుధవారం జరగనుండడంతో సాయి లక్ష్మి తన తల్లితో పాటు కలిసి స్కూటీ మీద గుడికి వెళ్లింది. ఇక రోడ్డుపై తల్లీకూతురు వెళ్తుండగా స్కూటీ అదుపు తప్పి ఆగి ఉన్న ఓ ప్రైవేట్ బస్సును ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో తల్లికి తీవ్ర గాయాలవ్వగా, సాయిలక్ష్మి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ ఒక్క క్షణంలో ఏం జరిగిందో ఆ తల్లికి ఏం అర్థం కాలేదు. కూతురు వద్దకు వెళ్లి చూడగా రక్తంతో తడిసి ప్రాణాలు కోల్పోయింది. కూతురు మరణించడంతో తల్లి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సాయిలక్ష్మి మృతదేహాన్ని బయటకు తీసి తల్లిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. తెల్లారితె పెళ్లి జరిగే వీరి ఇంట్లో విషాద ఛాయలు అలుముకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.