ఈ మద్య కొంత మంది చిన్న చిన్న విషయాలకే తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు.. ఆ సమయంలో తాము ఏం చేస్తున్నామో అన్న విచక్షణ కోల్పోతున్నారు. ఎదుటి వారిపై దాడులకు పాల్పడుతున్నారు.. కొన్ని సమయాల్లో హత్యలు కూడా చేస్తున్నారు. దేశ రాజధానిలో దారుణం జరిగింది. వీధిలోనే కొందరు చిన్నారులు రోడ్డుపై ఆడుకుంటుంటే.. వొద్దని ఏకంగా తుపాకీతో కాల్చాడు.. ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆసుపత్రికి తరలించారు.. వివరాల్లోకి వెళితే..
ఢిల్లీలో ఓ ప్రాంతంలో జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. అదే మసయంలో వీధిలోని కొంత మంది పిల్లలు రోడ్డుపైకి వచ్చి ఆడుకుంటున్నారు. బర్త్ డే పార్టీ కి వచ్చిన ఓ యువకుడు రోడ్డుపై పిల్లలను ఆడుకోవద్దని బెదిరించాడు. కానీ.. పిల్లలు అక్కడే ఆడుకోవడంతో కోపంతో ఊగిపోయి.. తన వద్ద ఉన్న రివాల్వర్ తీసి కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపింది 22 ఏళ్ల ఆమిర్ అలియాస్ హమ్జాగా పోలీసులు గుర్తించారు. పిల్లలకు బుల్లెట్స్ తగలడంతో ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ ముగ్గురు పిల్లలు కూడా పదమూడేళ్ళ లోపు వారు అని పోలీసులు తెలిపారు. మొదట వారిని వీధుల్లో ఆడుకోవద్దని అమీర్ చెప్పినా వినిపించుకోకపోవడంతో గొడవ మొదలైందని.. స్థానికులు చెప్పారు. ఆవేశంలో అమీర్ పిల్లలపై కాల్పులు జరిపాడని పొలీసులు తెలిపారు. ముగ్గురు పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీస్ అధికారి తెలిపారు. హత్యానేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.