నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన తల్లి హత్యకు పథకం రచించాడు. ఇందులో భాగంగానే ఆమెను చంపేందుకు తల్లి ఉంటున్న ఇంటికి నిప్పు పెట్టాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన తల్లిని ఎంతో ప్రేమగా చూసుకోవాల్సిన ఓ కొడుకు దారుణానికి పాల్పడ్డాడు. జన్మనిచ్చిన తల్లినే చంపేందుకు ఏకంగా ఆమె ఉంటున్న ఇంటికే నిప్పు పెట్టాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనతో గ్రామస్తులు అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్ధానికులు వెంటనే ఫైర్ ఇంజన్ అధికారులకు ఫోన్ చేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. తల్లిపై కొడుకుకి అంత పగ ఎందుకు? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా బీర్కూర్ లో చంద్రవ్వ అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు అశోక్ అనే కుమారుడు ఉన్నాడు. ఇతనికి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. ఇతడు భార్యతో పాటు హైదరాబాద్ లో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే తల్లీకొడుకు మధ్య గత కొంత కాలంగా మాటలు లేవని తెలుస్తుంది. కుమారుడు అశోక్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి తల్లితో గొడవ పడేవాడట. అంతేకాకుండా ఆమెపై దాడికి కూడా పాల్పడేవాడని తెలుస్తుంది. ఇక ఇదే కోపంతో కుమారుడు తల్లి చంద్రవ్వను చంపాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే అశోక్ రెండు రోజుల కిందట ఇంటికి వచ్చాడు. ఇక పక్కా ప్లాన్ తో తల్లి ఇంట్లో ఉందనుకుని బయట నుంచి గడియపెట్టి ఆమె ఇంటికి నిప్పు పెట్టాడు. విషయం ఏంటంటే? అదే సమయానికి చంద్రవ్వ బట్టలు ఉతకడానికి బయటకు వెళ్లింది. ఈ క్రమంలో మంటలు పెద్ద ఎత్తున అంటుకోవడంతో స్థానికులు గమనించి ఆర్పేందుకు అనేక ప్రయత్నాలు చేశారు.
మరి కొందరు వెంటనే ఫైర్ ఇంజన్ అధికారులకు ఫోన్ చేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ తో మాంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఆ తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అంతా పరిశీలించారు. అనంతరం తల్లి చంద్రవ్వ కొడుకు దారుణంపై పోలీసులకు వివరించింది. గత మూడు నెలల నుంచి నా కుమారుడు నాపై దాడి చేస్తున్నాడని, గతంలో నాపై పెట్రోల్ పోసి హత్య చేయాలని కూడా చూశాడంటూ తల్లి వాపోయింది. ఇక తాజాగా నేను ఇంట్లో ఉన్నానుకుని బయట నుంచి గడియ పెట్టి ఇళ్లుకు నిప్పటించాడంటూ చంద్రవ్వ కన్నీరు మున్నీరుగా విలపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే నిందితుడు అశోక్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. తల్లిని చంపేందుకు ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.