పండుగను బాగా చేసుకుందాం.. ఆ టైమ్‌కి అన్ని వస్తువులు దొరుకుతాయో? లేదో? అని నమ్మబలకి, అందుకోసం సంక్రాంతికి పప్పులను అందిస్తామని నెలకింత డబ్బు తమకు చెల్లించండి.. అంటూ సంక్రాంతి పప్పుల చిట్టీలను నడిపి.. తీరా పండుగ సమయానికి బోర్డు తిప్పేశారు మోసగాళ్లు. పండుగ కోసం డబ్బులు ఇచ్చిన అమాయకులను మోసం లక్షలకు లక్షలు దొచుకున్నారు. ఈ సరికొత్త మోసం విశాఖపట్నంలో వెలుగు చూసింది. సంక్రాంతి పండగకు పప్పు దినుసుల కావాలంటే.. నెలకు రూ. 200 నుంచి రూ.300లు చెల్లిస్తే చాలని తాము ఇస్తామని ఇద్దరు వ్యక్తులు ప్రజలకు ఎర వేశారు. వేమాలమ్మ పేరుతో సంక్రాంతి పప్పు చిట్టీలు వసూలు చేశారు.
కోట్లాది రుపాయాల డబ్బులు వసూలు చేసుకున్న తర్వాత బోర్డు తిప్పేశారు. దీంతో బాధితులు బుచ్చయ్యపేట పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల ఆస్తులు, పెట్టుబడులపై ఆరా తీస్తున్నారు. చిట్టిల పేరుతో మోసం చేసిన నిందుతులు ఏలియాబాబు అలియాస్ రవి, రామారెడ్డిలుగా గుర్తించారు. పరారిలో ఉన్న నిందితుల కోసం పోలీసుల గాలించారు. తమకు న్యాయం చేయమంటూ బాధితులు డిమాండ్ చేశారు. మరి ఇలాంటి సరికొత్త మోసాలకు బలవ్వకుండా జాగ్రత్త పడండి. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.