వివాహేతర సంబంధాల కారణంగా నిండు కాపురాలు నాశనం అవుతున్నాయి. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధాల్లో వేలు పెడుతూ పచ్చని సంసారాన్ని రోడ్డున పడేసుకుంటున్నారు. ఇంతటితో ఆగకుండా కొందరు మహిళలు ఈ క్షణిక సుఖం కోసం అడ్డొచ్చిన భర్తను సైతం హత్య చేయిస్తున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ భార్య ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేయించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. అది నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తుంగపాడు. ఇదే గ్రామానికి చెందిన లావుడ్య రాగ్య, రోజా భార్యాభర్తలు. వీరికి 12 ఏళ్ల కిందట వివాహం జరిగింది. రాగ్య కారు డ్రైవర్ గా పని చేస్తూ హైదరాబాద్ లోని మణికొండలో నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇబ్రహీంపట్నంలోని ఎల్లాపూర్ తండాకు చెందిన లక్పతితో అనే వ్యక్తితో రోజా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఇక భర్తకు తెలియకుండా భార్య రోజా ప్రియుడితో ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ ఉంది. అయితే ప్రియుడితో గడిపేందుకు భర్త రాగ్య అడ్డుగా ఉండడంతో రోజా ఇదే విషయాన్ని తన ప్రియుడు లక్పతికి వివరించింది. ఏం చేద్దాం అని అనుకుంటూ చివరికి ఇద్దరు ఓ నిర్ణయానికి వచ్చారు. రాగ్యను హత్య చేయాలనే మూర్ఖపు నిర్ణయాలు తీసుకున్న భార్య ప్రియుడి సాయంతో హత్య చేయించాలనుకుంది.
ఇందులో భాగంగానే మాన్ సింగ్, బాలోజీ అనే ఇద్దరు వ్యక్తులతో రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ముందుగా మాన్ సింగ్ రాగ్య ఫోన్ నెంబర్ తీసుకుని అతనితో పరిచయం పెంచుకున్నాడు. అలా కొన్ని రోజులు పాటు మాన్ సింగ్, బాలోజీ రెక్కి నిర్వహించారు. ఇక పక్కా ప్లాన్ ప్రకారం మాన్ సింగ్, బాలోజీ గత నెల 19న రాగ్యను దారుణంగా హత్య చేశారు. అనంతరం అతని డెడ్ బాడీకి ఇనుపు కడ్డీలు కట్టి సాగర్ పరిధిలోని కాజరాజుపల్లి సమీప చెరువులో పడేశారు. రాగ్య కనిపించడం లేదన్న విషయాన్ని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు గచ్చిబౌలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా అతని భార్య రోజాను విచారించారు. తనకు ఏం సంబంధం లేదని భార్య చెప్పినప్పటికీ పోలీసులకు భార్యపై అనుమానం వచ్చింది.
దీంతో ఆమె ఫోన్ కాల్ లీస్ట్ చెక్ చేయగా, మాన్ సింగ్, బాలోజీలతో ఆమె ఎక్కువ సార్లు మాట్లాడినట్లుగా తెలింది. ఇక పోలీసుల స్టైల్ లో విచారించగా ఎట్టకేలకు పక్కా ప్లాన్ ప్రకారమే రోజా తన భర్తను ప్రియుడి సాయంతో హత్య చేసిందని వెల్లడైంది. ఇక భర్త హత్యకు గాను రూ.20 లక్షల ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. తన ప్రియుడితో గడిపేందుకు భర్త అడ్డుగా ఉన్నాడన్న కారణంతో రూ.20 లక్షలు ఇచ్చి హత్య చేయించిన భార్య దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.