ఓ యువతి, ఇద్దరు ప్రియుళ్లు. మొదటి ప్రియుడితో కొన్నాళ్ల పాటు ఎంతో ప్రేమగా మెలిగిన ఆ యువతి... కొంత కాలానికి అతనికి గుడ్ బై చెప్పింది. ఆ తర్వాత మరో వ్యక్తితో ప్రేమాయణాన్ని కొనసాగించింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఆ యవతి పేరు అన్షితా రెడ్డి, వయసు 25 ఏళ్లు. హైదారాబాద్ లోని ఓ ప్రాంతానికిచెందిన ఈ యువతికి అవినాష్ రెడ్డి అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. అలా చాలా కాలం పాటు ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. కట్ చేస్తే.. ఆ యువతి ఇతడితో బంధానికి స్వస్తి పలికి మరో యువకుడితో సన్నిహితంగా మెలిగింది. ఇదే విషయం మాజీ ప్రియుడికి తెలిసింది. దీంతో ఆ యువకుడు ఆమెతో విభేదించి బై బై చెప్పాడు. కానీ, ఆ తర్వాత జరిగిందేంటంటే?
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ పరిధిలోని ఫిర్జాదిగూడకు చెందిన అరోషికా రెడ్డి (25) అనే యువతికి 2016లో మేడిపల్లికి చెందిన అవినాశ్ రెడ్డి (29) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. వీరి ప్రేమాయణం దాదాపు 5 ఏళ్ల పాటు కొనసాగింది. అయితే, ఇన్నేళ్ల కాలంలో అన్షితా రెడ్డి ప్రియుడు అవినాష్ రెడ్డి వద్ద రూ.25 లక్షలు అప్పుగా తీసుకుంది. చాలా కాలానికి ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని అవినాశ్ రెడ్డి ప్రియురాలిని కోరాడు. ఈ క్రమంలోనే అన్షితా రెడ్డి ప్రియుడిని దూరం పెట్టి సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారాన్ని నడిపించింది. కట్ చేస్తే.. ఇదే విషయం మాజీ ప్రియుడైన అవినాశ్ రెడ్డికి తెలియడంతో షాక్ గురయ్యాడు.
దీంతో అతడు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అన్షితా రెడ్డిని డిమాండ్ చేశాడు. ఇక ఆ యువతికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎలాగైన అవినాశ్ రెడ్డిని చంపాలని అనుకుంది. ఇందులో భాగంగానే అన్షితా రెడ్డి మాజీ ప్రియుడిని కిడ్నాప్ చేయాలని ప్లాన్ గీసింది. ఇకపోతే, ఇటీవల ఆ యువతి అవినాశ్ రెడ్డికి ఫోన్ చేసి.. ఆదివారం ఘట్ కేసర్ లోని ఓ హోటల్ వద్దకు వస్తే నీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పింది. దీనికి అతడు సరే అన్నాడు. ఇక పక్క ప్లాన్ తో కదిలిన అన్షితా రెడ్డి.. తాజా ప్రియుడు చక్రధర్ గౌడ్ తో పాటు మరి కొంతమంది స్నేహితులతో ఘట్ కేసర్ వెళ్లారు. ఇక అవినాశ్ రెడ్డి రాగానే అందరూ కలిసి అతడిని బలవంతంగా కారులో కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. ఇదంతా గమనించిన స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీరిని చూసి చక్రధర్ గౌడ్, అతని స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో అవినాశ్ రెడ్డి వెంటనే ఘట్ కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడు చక్రధర్ గౌడ్ తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారికి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.