మేడ్చల్ జిల్లాలోని జవహర్ నగర్ పరిధిలోని దమ్మాయిగూడలో 10 ఏళ్ల బాలిక నిన్నటి నుంచి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. అయితే గురువారం ఉదయం బాలిక ఎప్పటిలాగే స్కూలుకు వెళ్లింది. సాయంత్రం అయినా బాలిక రాకపోవడంతో ఆ బాలిక తల్లిదండ్రులు స్కూల్ హెడ్ మాస్టార్ ను అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాప ఎక్కడికి వెళ్లిందో మాకు కూడా తెలియదని చెప్పినట్లుగా తెలుస్తుంది. దీంతో ఖంగారుపడ్డ ఆ బాలిక తల్లిదండ్రులు అటు ఇటు అంతా వెతికారు. కానీ కూతురు ఆచూకి మాత్రం దొరకలేదు.
దీంతో వెంటనే ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు బృందాలుగా విడిపోయి బాలిక ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పోలీసుల గాలింపు చర్యల్లో భాగంగా స్థానికంగా ఉండే సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇందులో ఆ బాలిక అటు నుంచి నడుచుకుంటు వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. దీంతో స్థానికులు కూడా ఆ బాలిక ఆ చెరువు వైపుగా వెళ్లినట్లుగా తెలిపారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు స్థానికంగా ఉన్న ఆ చెరువులో గాలించగా చివరికి ఆ బాలిక శవమై కనిపించింది.
ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గడిచిన 24 గంటల తర్వాత ఆ బాలిక చెరువులో కనిపించడంతో పలు అనుమానాలకు తావు ఇస్తుంది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. అసలు ఆ బాలిక ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేసి ఆత్యహత్యగా చిత్రీకరిస్తున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.