దేశంలో యువకులు అడ్డు అదుపు లేకుండా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. మద్యానికి బానిసై, జులాయిగా తిరుగు చెడలవాట్లకు దగ్గరవుతున్నారు. ఇక ఇంతటితో ఆగుతున్నారా అంటే అదీ లేదు. రోడ్డుపై నచ్చిన అమ్మాయి కనిపిస్తే చాలు, ఐలవ్ యూ చెప్పడం కాదంటే హత్యలు చేయడం ఇదే నేటి కాలంలో జరుగుతున్న దారుణాలు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ యువకుడు యువతి పెళ్లికి ఒప్పుకోలేదని దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మధ్య ప్రదేశ్ లోని ఖంద్వా జిల్లాకు చెందిన ఓ యువకుడు స్థానికంగా నివాసం ఉంటున్నాడు. తాను ఉండే పరిసర ప్రాంతంలో ఓ యువతిని గత కొన్ని రోజుల నుంచి పరిశీలిస్తున్నాడు. అందంగా ఉందని, ఎలాగైన పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలు చేశాడు. ఇక అనుకున్నదే ఆలస్యం, ఇదే విషయాన్ని ఆ యువతికి వివరించాడు. కానీ ఆ యువతి.. నీతో పెళ్లికి నాకు ఇష్టం లేదని తెగేసి చెప్పింది. ఇదే విషయమై ఇద్దరి మధ్య కాస్త గొడవ జరిగింది.
ఇక కోపంతో ఊగిపోయిన యువకుడు యువతిని కత్తితో దారుణంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో అనంతరం ఆ యువకుడు ఓ డ్యామ్ వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక తీవ్ర గాయాలతో గాయపడ్డ యువతిని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.