ఆమెకు భర్త కన్నా ప్రియుడంటేనే ఎక్కువ ఇష్టం. మొగుడి కళ్లు గప్పి ఎన్నో సార్లు ప్రియుడితో తిరిగింది. కానీ, ఇటీవల మాత్రం.. ఏకంగా భర్త ముందే ప్రియుడితో కలిసి దారుణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
ఈ మధ్యకాలంలో కొందరు పెళ్లైన మహిళలు భర్త ఉండగానే మరో మగాడితో తిరుగుతున్నారు. కట్టుకున్న మొగుడి కళ్లు గప్పి ఎంచక్కా ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ నిండు కాపురాన్ని నిట్ట నిలువునా కూల్చేసుకుంటున్నారు. ఇలా ఎంతో మంది మహిళలు పెళ్లై పిల్లలు ఉన్నా కూడా చీకటి కాపురాలను కొనసాగిస్తున్నారు. అచ్చం ఇలాగే హద్దులు దాటిన ఓ ఇల్లాలు.. ఏకంగా భర్త ముందే ప్రియుడితో బరితెగించి దారుణానికి పాల్పడింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓ ప్రాంతం. ఇక్కడే జావేద్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి గతంలో ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అయితే ఈ క్రమంలోనే అతని భార్య భర్త ఉండగానే షకీర్ అనే యువకుడితో ప్రేమాయణాన్ని కొనసాగించింది. ఇక టైమ్ దొరికినప్పుడల్లా ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ ఉండేది. అలా కొన్ని రోజులు గడిచింది. కానీ, ప్రియుడితో గడిపేందుకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది. దీంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ సమయంలోనే ఆమెకు ఓ ఐడియా తన్నుకొచ్చింది. అదే భర్తను చంపడం. ఇదే విషయాన్నితన ప్రియుడు షకీర్ కు వివరించింది.
ప్రియురాలి మాటను విన్న ప్రియుడు కాదనకుండ సరేనంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో భాగంగానే ఇటీవల ఓ రోజు షకీర్ తన ప్రియురాలి ఇంటికి వచ్చాడు. వస్తూ వస్తూ ప్రియురాలి భర్తతో గొడవకు దిగాడు. భార్య మాత్రం భర్తకు కాకుండా ప్రియుడికి మద్దతు ఇచ్చింది. ఈ క్రమంలోనే ప్రియుడితో కలిసి భార్య రెచ్చిపోయింది. అందరూ చూస్తుండగానే జావేద్ ను ఇద్దరూ కలిసి అతి దారుణంగా హత్య చేశారు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడి భార్యతో పాటు ఆమె ప్రియుడు షకీర్ ను అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేసిన భార్య దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.