వారిద్దరు భార్యాభర్తలు. పెళ్లైన కొన్నాళ్ల నుంచి సంతోషంగా జీవిస్తున్నారు. కానీ భర్తే అప్పుడప్పుడు కాస్త వక్రబుద్దిని ప్రయోగిస్తుంటాడు. అయితే అత్తింట్లో ఉండి చాలా రోజులు కావడంతో భార్య సరదాగా ఇటీవల పుట్టింటికి వెళ్లింది. ఇదే మంచి సమయమనుకున్న భర్త, వెంటనే సోషల్ మీడియాలో పరిచయమున్న ఓ అమ్మాయిని ఇంటికి పిలిపించుకున్నాడు. ఆ అమ్మాయి రాగానే ఏదేదో చేసేయాలనే కసితో రగిలిపోయాడు. ఈ క్రమంలోనే కాలింగ్ బెల్ కొట్టి మూసుగేసుకుని ఆ అమ్మాయి ఇంట్లోకి అడుగు పెట్టింది. ఇక ఆమె వేసుకున్న మాస్క్ విప్పగానే అతడు ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. ఇంట్లోకి వచ్చింది మీరునుకున్నట్లు నిజంగానే అమ్మాయి కాదండయో, ఓ ట్రాన్స్ జెండర్. ఇన్నాళ్లు అమ్మాయి అని మురిసిపోయిన అతనికి సడెన్ గా ఆమె ట్రాన్స్ జెండర్ అని తెలియడంతో తర్వాత అతని రియాక్షన్ ఏంటి? ఆమెతో శారీరకంగా కలుసుకున్నాడా? ఆ రోజు రాత్రి ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది మధ్యప్రదేశ్ లోని ఖజ్రానా ప్రాంతం. ఇక్కడే నూర్‌మహ్మద్ అనే వ్యక్తి భార్యతో పాటు నివాసం ఉంటున్నాడు. అయితే ఇటీవల తన భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో నూర్‌మహ్మద్ కు ఇది వరకే సోషల్ మీడియాలో జోయా కిన్నార్ అనే అమ్మాయి పరిచయం ఉంది. ఇక తన భార్య పుట్టింటికి వెళ్లడంతో గత నెల 28న జోయా కిన్నార్ కు ఫోన్ చేసి తన ఇంటికి రప్పించుకున్నాడు. ఇక జోయా కిన్నార్ నూర్‌మహ్మద్ ఇంటికి రాగానే ఆమె వేసుకున్న మాస్క్ విప్పమన్నాడు. ఆమె విప్పగానే ఆమె అమ్మాయి కాదని, ఒక ట్రాన్స్ జెండర్ అని తెలుసుకున్నాడు.
దీంతో ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ తీవ్ర రూపం దాల్చింది. ఇక కోపంతో ఊగిపోయిన నూర్‌మహ్మద్ ఆమెను హత్య చేసి ఆమె శరీరాన్ని పదునైన ఆయుదంతో రెండు భాగాలు చేశాడు. అనంతరం ఒక భాగాన్ని ఇంట్లోనే ఉంచుకోగా, మరొక భాగాన్ని ఇండోర్ లోని పొదల చాటున విసిరేశారు. ఇక మరుసటి రోజు చిద్రమైన జోయా కిన్నార్ డెడ్ బాడీని చూసి స్థానికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు స్థానిక సీసీ కెమెరాలను పరిశీలించి అనుమానితులను విచారించారు. ఇక ఎట్టకేలకు జోయా కిన్నార్ ను హత్య చేసింది నూర్‌మహ్మదేనని పోలీసులు గుర్తించారు.
తర్వాత నిందితుడిని పోలీసులు విచారించగా.. నాకు జోయా కిన్నార్ సోషల్ మీడియాలో పరిచయం చేసుకున్నానని, నా భార్య పట్టింటికి వెళ్లడంతో ఆమెను ఇంటికి రప్పించుకున్నానని, చివరికి ఆమె ట్రాన్స్ జెండర్ అని తేలడంతో షాక్ కు గురయ్యానని తెలిపాడు. అనంతరం ఇదే విషయమై మా ఇద్దరి మధ్య కాస్త గొడవ కూడా జరిగిందని, కోపంతో ఊగిపోయిన నేను ఆమెను హత్య చేసి రెండు భాగాలు చేశానని నూర్‌మహ్మద్ వివరించాడు. అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.