Lucky Saxena: ప్రముఖ యాంకర్, కవయిత్రి లక్కీ సక్సేనా అలియాస్ నగ్మా బరేల్వి ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం రాత్రి ఇంట్లోని తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్, బరేలీ జిల్లాలోని ప్రేమ్ నగర్‌కు చెందిన లక్కీ సక్సేనా (47) యాంకర్‌గా, కవయిత్రిగా చాలా ప్రాచూర్యం పొందారు. సంవత్సరం క్రితం రాజా ఖాన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడారు. ఇక అప్పటినుంచి భర్త ఆమె దగ్గరే ఉంటున్నాడు. ఫ్యామిలీ మొత్తం బ్యాంకేస్ కంటోన్‌మెంట్‌లో ఉంటోంది. లక్కీ బుధవారం రాత్రి తన గదిలో నిద్రపోవటానికి వెళ్లారు. గురువారం ఉదయం 11గంటలు కావస్తున్నా తలుపు తీయలేదు. కుటుంబసభ్యులు వెళ్లి తలుపు తట్టగా లోపలినుంచి ఎలాంటి చప్పుడు రాలేదు. దీంతో వారు సుభాస్ నగర్‌లో ఉంటున్న లక్కీ సోదరికి సమాచారం ఇచ్చారు. ఆమె హుటాహుటిన అక్కడి చేరుకుంది. ఆ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. అక్కడికి వచ్చిన పోలీసులు గది తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లారు.
గదిలో ఫ్యానుకు వేలాడుతూ లక్కీ కనిపించింది. పోలీసులు లక్కీ మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే, లక్కీ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ కూతురిది ఆత్మహత్య కాదని, హత్య అని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాగా, లక్కీ సక్సేనా యాంకర్‌గా.. కవయిత్రిగా చాలా ఫేమస్. ఆమె కవితలు వినడానికి ముషైరా ఈవెంట్లకు పెద్ద సంఖ్యలో జనం వచ్చేవారు. ఆమె మైక్ పట్టుకుంటే చప్పట్లతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయేది. లక్కీ యాంకర్‌గా కూడా చాలా ప్రోగ్రామ్‌లు చేశారు. మరి, లక్కీ సక్సేనా మృతిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : హీరోయిన్ సాయి పల్లవిపై పోలీసులకు ఫిర్యాదు! కారణం?