ఓ ప్రేమ జంట బైక్ పై రొమాన్స్ తో రెచ్చిపోయింది. పబ్లిక్ లో ఉన్నామన్న సోయి కూడా మరిచి రొమాన్స్ లో మునిగితేలారు. వీరి సరసాలను చూడలేని కొందరు తలలు తిప్పుకుంటే.. మరి కొందరు మాత్రం..!
ఈ మధ్య కాలంలో లవర్స్ నడి రోడ్డుపై రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ జనాలు ఉన్నారని కూడా చూడకుండా బరితెగించి రొమాన్స్ తో హద్దులు దాటుతున్నారు. ఈ మధ్య ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. వీరిని గమనించిన కొందరు వాహనదారులు వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. ఇక వీడియోలు మెల్లగా పోలీసుల చెంతకు చేరడంతో వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. సరిగ్గా ఇలాగే రెచ్చిపోయిన ఓ ప్రేమ జంట.. బైక్ పై పబ్లిక్ గానే రొమాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
రాజస్థాన్ లోని అజ్మెర్ రోడ్డుపై ఓ ప్రేమ జంట బరితెగించి ప్రవర్తించింది. ప్రియుడు ప్రియురాలిని బైక్ ముందు కూర్చోబెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ యువతి ప్రియుడిని హగ్ చేసుకుంటూ ముద్దులతో ముంచెత్తింది. ఇక పబ్లిక్ లో ఉన్నామన్న సోయి కూడా మరిచి రొమాన్స్ లో మునిగితేలారు. వీరి సరసాలను చూడలేని కొందరు వాహనదారులు తలలు తిప్పుకుంటే.. మరి కొందరు మాత్రం ఏకంగా సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. అదే వీడియోలను చివరికి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఇక ఇదే వీడియో పోలీసుల వరకు వెళ్లడంతో వెంటనే స్పందించి వారిపై కేసు నమోదు చేశారు. పబ్లిక్ లో రొమాన్స్ తో రెచ్చిపోయిన ఈ ప్రేమ జంట తీరుపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
#Ajmer में बाइक पर लड़की को आगे बैठाकर रोमांस का वीडियो हुआ वायरल, आमजन ने कहा शहर में ऐसी अश्लीलता पर हो कार्यवाही। #Rajasthan @AjmerpoliceR @PoliceRajasthan @RajCMO #अजमेर pic.twitter.com/UtsBbekKAx
— MTTV INDIA (@MTTVINDIA) February 6, 2023