వైద్యం ముసుగు తొడిగిన కొందరు నీచులు అమ్మాయిలపై పాడుపనికి పరుగులు తీస్తున్నారు. దేవునితో సమానంగా కొలిచే డాక్టర్ లే చివరికి చెప్పకూడదని దారుణాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ PMP డాక్టర్ బరితెగించి దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పైన ఫోటోలో హీరోలా ఫోజులు ఇస్తున్న ఇతగాడిది కోనసీమ జిల్లాలోని ఓ ప్రాంతం. అయితే మామిడికుదరు మండలం పెదపట్నంలంక గ్రామానికి చెందిన ఓ బాలిక స్థానికంగా ఏడవ తరగతి చదువుతోంది. కాగా గత కొద్ది రోజుల నుంచి అదే బాలికపై డాక్టర్ వేది రమేష్ లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా తెలుస్తోంది. ఇతగాడి అరాచకాలను బరించలేకపోయిన సదరు బాలిక తల్లిదండ్రులకు ఇదే విషయాన్ని పూసగుచ్చినట్లు వివరించింది.
ఇది కూడా చదవండి: డబ్బు మోజులో పడి నన్ను దారుణంగా హింసించారు: యువకుడు ఆత్మహత్యదీంతో కోపంతో ఊగిపోయిన బాలిక తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమేష్ ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. డాక్టర్ రమేష్ దారుణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.