నేటి కాలంలో చాలామంది యువత ప్రేమించుకోవడం, కొన్ని రోజులు కలిసి తిరిగి మనస్పర్ధలు రావడంతో బ్రేకప్ చెప్పుకోడం. ఇలాంటి బ్రేక్ లవ్ స్టోరీలు ప్రస్తుత కాలంలో చాలా వెలుగు చూస్తున్నాయి. అయితే విడిపోయి వారి జ్జాపకాలను తలుచుకుని కొందరు ఏడుస్తుంటే.., మరికొందరు మాత్రం ఏకంగా పగతో రగిలిపోయి ప్రేమలో ఉన్నప్పుడు ఇచ్చిన వస్తువులను తిరిగి పొందేందుకు దేనికైన తెగిస్తున్నారు. ఇలాగే బరితెగించిన ఓ మాజీ ప్రియురాలు ఏకంగా మాజీ ప్రియుడిని కిడ్నాప్ చేసి ఊహించని రీతిలో షాక్ ఇచ్చింది. ప్రియురాలు మాజీ ప్రియుడిని ఎందుకు కిడ్నాప్ చేసిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కోల్ కతాకు చెందిన తమల్ అనే యువకుడు గతంలో ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరు కొన్నాళ్లపాటు కలిసి సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగారు. కానీ ఏదో కారణంతో ఇద్దరికి మనస్పర్ధలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారు. ఇప్పటి వరకు బాగానే ఉన్నా.. ఆ యువతి తన మాజీ ప్రియుడితో ప్రేమలో ఉన్నప్పుడు తమల్ కు రూ.30 వేలు ఇచ్చింది. ఆ డబ్బులను ఎలాగైన రాబట్టాలని ప్లాన్ గీసింది. ఇందులో భాగంగానే మాజీ ప్రియురాలు ప్రస్తుత ప్రియుడితో కలిసి మాజీ ప్రియుడిని కిడ్నాప్ చేసింది.
ఆ తర్వాత అతడి తండ్రికి ఫోన్ చేసి.. నాకు లక్ష రూపాయలు ఇస్తేనే మీ కొడుకుని వదిలిపెడతామని వార్నింగ్ ఇచ్చింది. దీంతో వెంటనే స్పందించిన ఆ యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తమల్ ను రక్షించి ఆ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.