కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. నగ్నంగా దేవుడికి పూజలు చేస్తే అప్పలు తీరుతాయని కొందరు దుండగులు హద్దులు దాటి ప్రవర్తించారు. ఇంతటితో ఆగకుండా లాడ్జిలోకి తీసుకెళ్లి నగ్నంగా దేవుడికి పూజలు చేయించారు. ఇక ఇంతటితో ఆగకుండా నగ్నంగా పూజలు చేస్తుండగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఆ వీడియో కాస్త వైరల్ గా మారడంతో పోలీసుల వరకు వెళ్లింది. ఇటీవల చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు కథ ఏంటంటే? కర్ణాటకలోని కొప్పల్ రూరల్ ప్రాంతంలో 16 ఏళ్ల బాలుడు నివాసం ఉంటున్నాడు.
అయితే ఇక్కడే నివాసం ఉంటున్న మరో ముగ్గురు నిందితులు ఆ బాలుడిని నమ్మించి దారుణానికి పాల్పడ్డారు. మీ నాన్న చేసిన అప్పులు తొందరగా తీరాలంటే నగ్నంగా దేవుడికి పూజలు చేయాలని కోరారు. ఇదంతా నిజమే అని నమ్మిని ఆ బాలుడు వారు చెప్పినట్టే చేయడానికి రెడీ అయ్యాడు. వెంటనే ఆ ముగ్గురు నిందితులు ఆ బాలుడిని హబ్బళ్లిలోని ఓ లాడ్జిలోకి తీసుకెళ్లారు. ఇక అనంతరం అక్కడికి వెళ్లాక ఆ ముగ్గురు యువకులు ఆ బాలుడి బట్టలు విప్పమన్నారు. తర్వాత ఆ బాలుడిని నగ్నంగా దేవుడికి పూజలు చేయిస్తూ వీడియోలు తీశారు. ఇంతటితో ఆగకుండా ఆ దుర్మార్గులు ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఆ వీడియోలు రాను రాను పోలీసుల వరకు వెళ్లాయి. వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.