ఈ మధ్యకాలంలో కొందరు పెళ్లైన మహిళలు తాళికట్టిన భర్తలను కాదని పరాయి మగాళ్లపై మనసుపడుతున్నారు. వాళ్లతోనే సీక్రెట్ గా ఈ వ్యవహారాన్ని నడిపిస్తూ చివరికి అడ్డొచ్చిన వారిని సైతం హత్య చేసేందుకు కత్తులు నూరుతున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఈ మహిళ ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతోంది. అసలేం జరిగిందంటే?
ఈ రోజుల్లో పెళ్లైన కొంత మంది మహిళలు భర్తలను కాదని పరాయి మగాళ్లపై మోజుపడుతున్నారు. ఇక అతనితోనే సీక్రెట్ గా చీకటి కాపురాన్ని నడిపిస్తూ చివరికి అడ్డొచ్చిన వారిని సైతం అడ్దుతొలగిస్తున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ వివాహిత.. ప్రియుడిపై మోజుతో భర్తకు విడాకులు ఇచ్చింది. అంతేకాకుండా తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సొంత తమ్ముడిపై దారుణానికి పాల్పడింది. చాలా ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
అది కర్ణాటకలోని బనశంకరి ప్రాంతం. ఇక్కడే భాగ్యశ్రీ అనే మహిళ నివాసం ఉండేది. ఈ మహిళకు చాలా ఏళ్ల కిందటే ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ భార్యాభర్తల కాపురం సజావుగానే సాగుతూ వచ్చింది. అలా రాను రాను ఈ కీలాడీ లేడీ తన అసలు రూపాన్ని బయపెట్టింది. షాకింగ్ న్యూస్ ఏంటంటే? భాగ్యశ్రీకి పెళ్లికి ముందు నుంచే సుపుత్రత శంకరప్ప అనే వ్యక్తితో పరిచయం ఉంది. అయితే భర్తతో కాపురం చేస్తున్నట్లు నటిస్తూనే ఈ కిలాడీ లేడీ.. ప్రియుడు శంకర్ ను తరుచు కలుస్తుండేది.
ఇక మొగుడితో ఉండలేని ఆ మహిళ 2015లో భర్తకు విడాకులు ఇచ్చింది. దీంతో అప్పటి నుంచి ప్రియుడితో చీకటి కాపురాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఇదే విషయం భాగ్యశ్రీ తమ్ముడికి తెలిసింది. దీంతో తమ్ముడు అక్క భాగ్యశ్రీని ఇదేం పని అంటూ గట్టిగా ప్రశ్నించాడు. తమ్ముడికి ఏం సమాధానం చెప్పాలో తెలియని ఆ మహిళ నోట్లో నీళ్లు నమిలింది. ఇక ఇలా అయితే కాదని భావించిన ఈ మాయలేడి.. తన తమ్ముడి హత్యకు పథకం రచించింది.
తాను అనుకున్నట్లుగానే భాగ్యశ్రీ ప్రియుడు శంకర్ తో చేతులు కలిపి 2015లో తన సోంత తమ్ముడిని అతి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత అతడి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి అక్కడక్కడ పడేశారు. అప్పటి నుంచి భాగ్యశ్రీ తమ్ముడు కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక ఈ ఘటన అనంతరం భాగ్యశ్రీ ప్రియుడితో కలిసి మహారాష్ట్రలోని నాసిక్ లో నివాసం ఉంది. కట్ చేస్తే.. ఈ కేసును అప్పటి నుంచి విచారించిన పోలీసులు దాదాపు 8 ఏళ్ల తర్వాత నిందితులు భాగ్యశ్రీ, ఆమె ప్రియుడు శంకర్ లను అరెస్ట్ చేసి ఇటీవల జైలుకు తరలించారు. ప్రియుడి కోసం ఏకంగా సొంత తమ్ముడిని దారుణంగా హత్య చేసిన ఈ కిలాడీ లేడి కిరాతకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.