ఓ మంత్రి రాసలీలల వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో ఆ నాయకుడు ఓ మహిళతో అసభ్యకరంగా మాట్లాడుతో దొరికిపోయాడు. అదే వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. ఇంతకు ఎవరా మంత్రి అనేది తెలుసుకోవాలనుందా?
ఈ మధ్య కొందరు రాజకీయ నాయకులు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. రాజకీయ అండతో ఎన్నో దౌర్జన్యాలు, భూ కబ్జాలు, రౌడీయిజం వంటివి చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. ఇక ఇవే కాకుండా అందమైన మహిళలపై కన్నేస్తూ చివరికి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి పాడు పనులు చేస్తూ ఇప్పటికి ఎంతో మంది నేతలు నేతల వ్యవహారాలు బయపడ్డాయి. ఇదిలా ఉండగానే ఓ మంత్రి మహిళతో సరసాలకు దిగిన వీడియో వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఏకంగా వీడియో కాల్ తో అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. వెంటనే రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష పార్టీ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఇంతకు ఎవరో మంత్రి? ఏంటా స్టోరీ?
బన్నా గుప్తా ప్రస్తుతం జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఇతను ఓ మహిళతో చాట్ చేసిన వీడియో బహిర్గతం అయింది. అంతే కాకుండా ఆమెతో మాట్లాడిన వీడియో కాల్ కూడా బయటపడింది. మంత్రి బన్నా గుప్తా ఆ మహిళతో అసభ్యకరంగా మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన మంత్రులు షాక్ గురయ్యారు. ఇక ఇదే ఆసరాగా చేసుకున్న ప్రతిపక్ష పార్టీలు.. మంత్రి అయి ఉండి ఇదేం పనంటూ వాపోతున్నారు. బన్నా గుప్తా వెంటనే పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఈ వీడియో వ్యవహారంపై స్పందించి మంత్రి బన్నా గుప్తా.. తనకేం సంబంధం లేదని, ఎవరో నా ప్రతిష్ఠకు భంగం కలిగించి పరువు తీయడానికి మార్ఫింగ్ చేశానని అన్నారు. ఈ వీడియోపై నేను పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని, నేనెలాంటి తప్పు చేయలేదని తెలిపారు. ఇక ఆ రాష్ట్ర ముఖమంత్రి హేమంత్ సోరెన్ సైతం ఈ వ్యవహారంపై స్పందించి నిజ నిజాలు ఏంటో తేల్చాలని, ఇదంతా నిజమే అయితే కఠిన శిక్ష తప్పదని ఆయన అన్నారు. మంత్రి బన్నా గుప్తా రాసలీల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. పోలీసులు ఈ వీడియోపై విచారణ జరుపుతున్నట్లు తెలుస్తుంది. వైరల్ గా మారిన మంత్రి బన్నా గుప్తా రాసలీలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.