హైదరాబాద్ ముసినది పరివాహక ప్రాంతంలో మొండం లేని తల మహిళ తల లభ్యమైంది. దీనిని చూసి స్థానికులు ఒక్కసారిగా భయందోళనలకు గురయ్యారు. అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. కొందరు దుండగులు గుర్తు తెలియని ఓ మహిళను చంపారు. ఆ తర్వాత ఆమె మొండం లేని తలను ప్లాస్టిక్ కవర్ లో పెట్టి మలక్ పేట్ మూసినది పరివాహక ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు. అయితే బుధవారం ఉదయం కొందరు స్థానికులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు అక్కడికి వెళ్లారు. దీంతో వారికి ప్లాస్టిక్ కవర్ లో మొండం లేని మహిళ తల కనిపించింది. ఈ సీన్ చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన క్లూస్ టీమ్ సాయంతో అక్కడికి చేరుకున్నారు.
అనంతరం పోలీసులు మొండం లేని ఆ మహిళ తలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇకపోతే.. ఆ తల ముస్లిం మహిళదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎక్కడో హత్య చేసి ఆ తర్వాత ఆమె తలను ప్లాస్టిక్ కవర్ లో ఇక్కడ వదిలేసి వెళ్లిపోయారని భావిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక దారుణ ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు డాగ్ స్కాడ్ సాయంతో నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటనతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంతకి తల ఎవరిది? ఎందుకు ఆమెను హత్య చేయాల్సి వచ్చింది? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.