ఈ మధ్యకాలంలో కొందరు కేటుగాళ్లు సులభంగా డబ్బులు సంపాదించాలని హైదరాబాద్ తోపాటు మరిన్ని నగరాలను వేదికలుగా చేసుకుని వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. అందమైన అమ్మాయిలే టార్గెట్ చేసుకుని పలు వెబ్ సైట్స్ లో ఎస్కార్ట్ పేరుతో గట్టుచప్పుడు కాకుండా ఈ పాడు పనులకు శ్రీకారం చుడుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఢిల్లీ, ముంబై, బంగ్లాదేశ్, నేపాల్, రష్యా, థాయ్ లాండ్ వంటి ప్రాంతాల్లోని అందమైన అమ్మాయిలను ఎరగా వేస్తూ ముఠా సభ్యులు వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా సాగిస్తున్న ఈ అంతర్జాతీయ సెక్స్ రాకేట్ ముఠా సభ్యులను హైదరాబాద్ పోలీసులు పట్టికున్నారు. అనంతరం 14 వేల 190 మంది బాధితులను రక్షించినట్లుగా మీడియా సమావేశంలో తెలిపారు. అసలు ఈ అంతర్జాతీయ సెక్స్ రాకేట్ గుట్టు ఏంటి? ఈ కేటుగాళ్లు ఎలా వ్యభిచారాన్ని నడిపించారనే పూర్తి వివరాలు మీ కోసం.
దేశంలో అనేక చోట్ల కొందరు కేటుగాళ్లు కష్టపడి సంపాదించకుండా వ్యభిచారం పేరుతో లక్షలు సంపాదిస్తున్నారు. దీని కోసం ఎంతోమంది అమ్మాయిలను ఈ రొంపిలోకి దింపుతున్నారు. ఇక ఈ వ్యభిచారాన్ని నడుపుతున్న కొందరు కేటుగాళ్లు మంచి ప్లాన్ తోనే రంగంలోకి దిగారు. కొన్ని వెబ్ సైట్స్ పేర్లతో అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టి ఈ గలీజ్ దందాకు పావులు కదిపారు. ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఢిల్లీ, ముంబై, బంగ్లాదేశ్, నేపాల్, థాయ్ లాండ్ లతో పాటు రష్యా వంటి నగరాల నుంచి అమ్మాయిలను తీసుకొస్తున్నారు.
ఉపాధి కల్పిస్తామని నమ్మించి.. ఇక్కడికి తీసుకొస్తున్నారు. తీరా ఆ అమ్మాయిలు వచ్చాకా.. వ్యభిచార రొంపిలోకి దింపెస్తున్నారు. ఇలా దాదాపుగా 14 వేల 190 మందితో ఈ సెక్స్ రాకెట్ ను నడిపించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సెక్స్ రాకేట్ ను నడిపించడంలొ 17 మంది కేటుగాళ్లు ముఖ్యపాత్ర పోషించినట్లుగా హైదరాబాద్ పోలీసులు తెలుసుకున్నారు. ఇక టెక్నాలజీ ఆధారంగా ఈ వ్యభిచార గుట్టును హైదరాబాద్ పోలీసులు విప్పారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న 17 మందిని అరెస్ట్ చేశారు. దీంతో పాటు కొన్ని రాష్ట్రాలకు చెందిన 14 వేల 190 మంది బాధితులను రక్షించినట్లు పోలీసులు తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి ఈ ఘటనతో పోలీసులు షాక్ కు గురవుతున్నారు.