హైదరాబాద్ లో ఓ ఆటో డ్రైవర్ రెచ్చిపోయాడు. అభం, శుభం తెలియని ఓ చిన్నారిపై ఆ దుర్మార్గుడు నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని బంజారాహిల్స్ పరిధిలోని ఓ ప్రాంతంలో ఓ నాలుగేళ్ల చిన్నారి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. అయితే ఈ చిన్నారి ఇటీవల రోడ్డుపై ఆడుకుంటూ ఉంది. ఆ చిన్నారిని గమనించిన ఓ ఆటో డ్రైవర్.. చాక్లెట్ ఇస్తానని ఆశ చూపి అభం, శుభం తెలియని ఆ బిడ్డను తన ఆటో ఎక్కించుకున్నాడు. ఇక ఇదే మంచి సమయం అనుకున్న ఆ కిరాతకుడు.. ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
అయితే ఈ దారుణాన్ని గమనించిన కొందరు స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ చిన్నారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. మహిళలపై జరుగుతున్న అత్యాచార దారుణాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు దిశ, నిర్భయ వంటి చట్టాలు రూపొందించినా.. దుర్మార్గుల ఆలోచనల్లో మార్పు రాకపోవడం విశేషం. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.