నేటి కాలంలో కొంతమంది మహిళలు తాళికట్టిన భర్తతో కాపురం చేస్తూనే పరాయి మగాళ్లలతో ఎఫైర్ ను కొనసాగిస్తున్నారు. దీని కారణంగా వారి కాపురాలు రోడ్డున పడడమే కాకుండా చివరికి వారు ఎటు కాకుండా పోతున్నారు. అయితే ఓ పెళ్లైన మహిళ భర్తను కాదని ఏకంగా ఇద్దరు ప్రియుళ్లతో రొమాన్స్ కు తెర లేపింది. ఇక ఆ మహిళ వివాహేతర సంబంధమే చివరికి ఆమె తల్లిదండ్రుల మరణానికి కారణం అయింది. అసలు ఈ క్రైమ్ స్టోరీలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది గుంటూరు జిల్లా చెబ్రోలు మండలం వడ్లమూడి. ఇదే గ్రామంలో సాంబశివరావు, అనిత అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతులు ఎలాంటి గొడవలు, మనస్పర్ధలు లేకుండా సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఈ క్రమంలోనే అనిత తన బుద్దిని వక్రమార్గంలోకి నెట్టేసింది. విషయం ఏంటంటే? ఇదే మండలానికి చెందిన రాజ్ కుమర్ అనే వ్యక్తితో అనిత వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. భర్తకు తెలియకుండా ఎంచక్కా ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ వచ్చింది. అలా కొన్ని రోజులు గడిచాక అనిత మరో వ్యక్తితో చనువుగా ఉండడం మొదలు పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న అనిత ప్రియుడు రాజ్ కుమార్ కోపంతో ఊగిపోయాడు.
ఈ క్రమంలోనే అనిత తన పుట్టింటికి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న రాజ్ కుమార్ ఎలాగైన అనితను పుట్టింటికి వెళ్లి ఆ విషయం గురించి నిలదీయాలనుకున్నాడు. అక్కడికి వెళ్లడమే కాకుండా రాజ్ కుమార్ అనిత తల్లి ముందే అనితతో గొడవ పడ్డాడు. దీంతో కోపంతో ఊగిపోయిన అనిత తల్లి రాజ్ కుమార్ పై మాటలతో ఎదురు దాడికి దిగింది. ఇదే రాజ్ కుమార్ కు అస్సలు నచ్చలేదు. కూతురి వివాహేతర సంబంధానికి అనిత తల్లే వత్తాసు పలుకుంతుందనే దుష్ప్రచారం కూడా చేశాడు. ఇక అనిత తల్లి బతికి ఉంటే అనితతో తన సంబంధాన్ని నడిపించలేనని అనుకున్నాడు. ఇక ఎలాగైన సరే అనిత తల్లిని హత్య చేయాలని ప్లాన్ గీశాడు. ఇందులో భాగంగానే రాజ్ కుమార్ 2021 నవంబర్ 19న తన ఇద్దరి స్నేహితులతో కలిసి అనిత తల్లిని హత్య చేసేందుకు బయలుదేరారు.
వారికి ఇంటికి చేరుకున్నాకున్నారు. అయితే రాజ్ కుమార్ ముందుగా అనిత తల్లిని మాత్రేమే హత్య చేయాలనుకుని వెళ్లినా.. ఆమె భర్త కూడా అరుస్తుండడంతో అనిత తల్లిదండ్రులను ఇద్దరినీ హత్య చేశారు. ఇంతటితో ఆగకుండా అనిత తల్లి చెవులను కోసి ఆ చెవులకు ఉన్న బంగారు కమ్మలు సైతం లాక్కెళ్లారు. అనంతరం అనిత కుటుంబ సభ్యులు వీరి హత్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి నిందితుల కోసం గాలించారు. ఇక 10 నెలల తర్వాత ఎట్టకేలకు శుక్రవారం నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసును ఛేదించిన పోలీసులకు అధికారులు నగదు ప్రోత్సహకాలు అందించడం విశేషం. అనిత వివాహేతర సంబంధమే ఆమె తల్లిదండ్రుల మరణానికి కారణమైందని పోలీసులు భావించారు. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.