ఆమె ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. స్థానిక ప్రజల పట్ల నమ్మకంగా పనులు చేస్తూ చివరికి అలాంటి పనులతో అడ్డంగా దొరికిపోయింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందంటే?
పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు రాణి. తమిళనాడు పోలీస్ శాఖలో పవర్ ఫుల్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. స్థానికంగా ఉండే ప్రజల పట్ల మంచి ఆఫీసర్ గా పేరు పొందింది. అయితే అంతా బాగానే ఉన్నా.. ఇటీవల ఈ మేడం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ అలాంటి పనులతో అడ్డంగా దొరికిపోయింది. ఈ విషయం పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆమెకు ఊహించని ఝలక్ ఇచ్చారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందంటే?
తమిళనాడు చెన్నైలో రాణి మహిళా ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వర్తించారు. గత కొంత కాలం నుంచి ప్రజల పట్ల నమ్మకంగా పని చేస్తూ మంచి పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో జరిగిన కొన్ని రోడ్డు ప్రమాదాల సమయంలో ఆమె లంచాలు తీసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు స్పందించి ఆ దిశగా విచారణ చేపట్టారు. అయితే పోలీసుల దర్యాప్తులో మాత్రం ఇన్ స్పెక్టర్ రాణి లంచాలు తీసుకున్నది నిజమేనంటూ రుజువు అయింది.
దీంతో వెంటనే తమిళనాడు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు.. మహిళా ఇన్ స్పెక్టర్ రాణిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్ని రోజులు అందరి ముందు మంచి ఆఫీసర్ గా నటించిన ఈ మేడం.. లంచాలు తీసుకుని చివరికి అడ్డంగా దొరికిపోయింది. ఈ ఘటనపై స్పందించిన స్థానికులు.. మహిళా ఇన్ స్పెక్టర్ అయి ఉండి ఇవేం పనులు మేడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. లంచాలు తీసుకుని అడ్డంగా దొరికిపోయిన ఈ మేడం ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.