పైన ఫొటోలో కనిపిస్తున్న యువకుడి పేరు వికాస్ గౌతమ్. చూడటానికి ఎర్రగా బుర్రగా, ఓ ఆఫీసర్ లా ఉన్నాడు కదూ! అలా అనుకుంటే 12 మంది మహిళల్ల మనం కూడా మోసపోయినట్టే. అవును మీరు విన్నది నిజమే. ఇతడు చదివింది 8 తరగతి కానీ, IPS ఆఫీసర్‌లా ఫోజులు కొడుతూ ఇప్పటికీ 12 మంది మహిళలను నమ్మించి మోసం చేశాడు. ఇక పక్కా ప్లాన్ తో వెళ్లిన ఓ బాధితురాలు ఎట్టకేలకు ఇతగాడి వ్యవహారాన్ని బయటపెట్టింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అసలు ఈ యువకుడు ఎవరు? IPS ఆఫీసర్‌లా నమ్మించి ఏం చేశాడనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సోషల్ మీడియా యుగం కొత్త పుంతలు తొక్కడంతో మోసాలు కూడా అంతకు మించి జరుగుతున్నాయి. సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని కొంత మంది సైబర్ నేరాలకు పాల్పడి నమ్మించి లక్షలు లక్షలు గుంజుతున్నారు. అచ్చం ఇలాంటి తెలివి తేటలు ఉపయోగించాడు ఈ వికాస్ గౌతమ్. మధ్య ప్రదేశ్ కు చెందిన ఇతడు ఢిల్లీలో నివాసం ఉంటూ ఓ రెస్టారెంట్ లో పని చేస్తున్నాడు. ఇతగాడు చదివింది 8వ తరగతి, కానీ IPS ఫోజులు కొడుతూ సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేస్తాడు. సోషల్ మీడియాలో కనిపించిన ప్రతీ మహిళకు రిక్వస్ట్ పెడతాడు. వాళ్లు నిజంగానే IPS ఆఫీసర్ లా కనిపించడంతో అతని రిక్వస్ట్ ను యాక్సెప్ట్ చేసి అనంతరం అతడితో ఛాటింగ్ చేస్తారు. ఇలా దాదాపుగా డజన్ మందిని నమ్మించి మోసం చేసిన వికాస్.. లక్షలు గుంజుకున్నాడు.
ఇదిలా ఉంటే ఢిల్లీలో డాక్టర్ గా పని చేస్తున్న ఓ మహిళాతో వికాస్ పరిచయం పెంచుకున్నాడు. చాన్నాళ్ల నుంచి ఆమెతో మాటలు కలిపాడు. ఇక ఇటీవల నాకు అర్జెంట్ గా డబ్బులు కావాలంటూ ఆ మహిళ నుంచి రూ.25 వేలు పంపించుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆ మహిళా డాక్టర్ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరింది. దీనికి మనోడు లేవంటూ సమాధానం ఇచ్చాడు. అనేకసార్లు పద్దతిగా అడిగింది.. అయినా సరే డబ్బులు ఇవ్వకుండా చంపేస్తానంటూ బెదిరించాడు. చివరికి ఆ మహిళా డాక్టర్ కు తెలిసింది ఏంటంటే? అతడు IPS ముసుగులో ఉన్న మోసగాడని. దీంతో ఆ మహిళ అతడి మోసాలను బయటపెట్టాలని భావించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఇతగాడి దారుణం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మారువేషంలో మహిళలను నమ్మించి మోసం చేసిన ఇతగాడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.