crime news : నమ్మి తన వెంట వచ్చిన బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. దాన్ని వీడియో తీసి బెదిరించి మరికొన్ని సార్లు అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా ఆ వీడియోను ఫ్రెండ్స్‌కు పంపాడు. అలా బాలిక జీవితం అత్యాచారాల పర్వాలకు గురై నలిగింది. చివరకు పోలీసుల సహాయంతో బయటపడగలిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… రాజస్తాన్, చురులోని కొత్వాలి ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల బాలిక ఇంటర్ చదువుతోంది. ఆమెకు 6 నెలల క్రితం సచిన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఓ రోజు సచిన్ ఐస్‌క్రీమ్ తినిపిస్తానని చెప్పి బాలికను కేఫ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత బాలికతో తన ఇళ్లు చూపిస్తాను రమ్మన్నాడు. సరేనంది. ఇద్దరూ అతడి ఇంటికి వెళ్లారు.
ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం అత్యాచారం చేశాడు. దాన్నంతా వీడియో తీశాడు. వీడియో చూపించి తర్వాత చాలా సార్లు బాలికపై అత్యాచారం చేశాడు. కొన్ని రోజులకు ఆ వీడియోను ఫ్రెండ్ షారుక్‌కు పంపాడు. ఇక అప్పటినుంచి షారుక్ కూడా బాలికను బెదిరించి రేప్ చేయటం మొదలుపెట్టాడు. సచిన్ అంతటితో ఆగకుండా ఆ వీడియోను తన స్నేహితులైన ఇర్ఫాన్, ఆషిక్, ప్రిన్స్‌లతో పాటు మరికొంత మందికి పంపాడు. దీంతో వారు కూడా ఆమెపై అత్యాచారం చేయటం మొదలుపెట్టారు.
ఇంట్లో చెప్పలేక, వాళ్ల అత్యచారాలు భరించలేక బాలిక అల్లాడిపోయింది. ఓ రోజు ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లిన బాలిక సాయంత్రం ఎప్పుడో ఇంటికి వచ్చింది. తల్లి ఎందుకు లేటయింది అని గట్టిగా నిలదీసింది. ఇదే సరైన సమయంగా భావించి తనకు జరుగుతున్న అన్యాయాన్ని తల్లికి వివరించి కన్నీరు మున్నీరయింది. తల్లి, బాలికను తీసుకెళ్లి మహిళా పోలీస్ స్టేషన్లో నిందితులపై కంప్లైంట్ ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : యాక్సిడెంట్ లో భర్త మృతి! పోలీసులు కూడా ఊహించని ట్విస్ట్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.