The Great Khali: డబ్ల్యూడబ్ల్యూఈ గురించి తెలిసిన వారికి పరిచయం అక్కర్లేని పేరు ‘ది గ్రేట్ ఖలీ’. ఖలీని చూడగానే ‘‘ఓరినాయనో’ అనటం మామూలే. ఏడడుగులకు పైగా ఎత్తు.. భారీ శరీరం రెజ్లింగ్ రింగ్‌లోకి అడుగుపెట్టగానే ప్రత్యర్థులకు సైతం గుండెలు అదురుతాయి. డబ్ల్యూడబ్ల్యూఈలో టాప్ పొజిషన్‌లో ఉన్న ఆయన కొన్నేళ్ల క్రితమే ఆ షోకు గుడ్‌బై చెప్పారు. ఇండియాకు తిరిగి వచ్చేశారు. సొంతంగా ఓ రెజ్లింగ్ అకాడమీని స్థాపించారు. ప్రస్తుతం పంజాబ్‌లోని సొంత ఊరిలోనే ఉంటూ..
అకాడమీని చూసుకుంటూ జీవితాన్ని ఆస్వాధిస్తున్నారు. తాజాగా, ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఖలీ ఓ టోల్ సిబ్బందిపై చెయ్యి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం ఖలీ తన కారులో నేషనల్ హైవేపై జలందర్‌నుంచి కర్నల్ వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ టోల్ గేట్ వద్ద టోల్ సిబ్బంది ఆయన కారును ఆపారు. ఏ విషయంలో గొడవ మొదలైందో తెలియదు కానీ, ఖలీ ఓ టోల్ సిబ్బందిపై చెయ్యి చేసుకున్నారంట.
ఖలీ టోల్ సిబ్బందితో గొడవ పడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. టోల్ సిబ్బందిపై చెయ్యి చేసుకున్నాడన్న ఆరోపణలతో ఫిలౌర్ ఏరియా పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. మరి, ది గ్రేట్ ఖలీ టోల్ సిబ్బందిపై చెయ్యి చేసుకున్నట్లు వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#ViralVideo | The Great #Khali allegedly slapped an employee at a toll plaza after a heated argument. One toll plaza staffer recorded the incident, the clip has now gone viral. pic.twitter.com/MjIFPex013
— Mirror Now (@MirrorNow) July 12, 2022
ఇవి కూడా చదవండి : Rajasthan: సెలవు ఇవ్వలేదని రిఫైల్ తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య!