ఈ మధ్యకాలంలో పెళ్లైన కొందరు వ్యక్తులు భార్యను కాదని పరాయి మహిళ మోజులో పడుతున్నారు. ఇంతటితో ఆగకుండా ప్రియురాలి మైకంలో పడి భార్యను, పిల్లలను కాదని ప్రేయసి వద్దే ఉండేందుక ఇష్టపడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే నెల్లూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి భార్యను, కుమారుడిని కాదని ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని గూడూరుకి తస్లీమా అనే మహిళకి కోటకి చెందిన కరిముల్లాతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. కొంత కాలం వీరి సంసారం సాఫీగానే సాగి ఓ కుమారుడు కూడా జన్మించాడు. అయితే ఈ మధ్యకాలంలో భర్త కరిముల్లా మరో యువతి మాయలో పడి ఏకంగా కుటుంబాన్ని కాదనుకున్నాడు. ఇదే కాకుండా ఇటీవల తన ప్రియురాలితో పరారై పెళ్లి కూడా చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య తస్లీమా భర్త షాప్ ముందు కుమారుడితో ధర్నాకు దిగింది.
భార్య తస్లీమా ఫేక్సీలో భర్త ఫోటోపై చెప్పుతో కొడుతూ అక్కడే వంట కూడా చేసుకుంటూ నిరసన తెలుపుతుంది. వెంటనే నాకు న్యాయం చేయాలంటూ భార్య తస్లీమా డిమాండ్ చేస్తుంది. ఈ ధర్నాలో ఆ తల్లి కుమారుడు అమాయకంగా ఫ్లేక్సీ పట్టుకుని నాకు మా నాన్నే కావలని చెబుతుండడంతో ఈ సీన్ చూసిన అందరు కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి కోసం ఓ చిన్నారి చేస్తున్న ఈ న్యాయ పోరాటంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.