క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగానే స్టేడియంలో ఆత్మహుతి దాడి జరిగింది. ఈ బాంబు దాడి ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నగరంలో చోటు చేసుకుంది. అలోకోజాయ్ కాబూల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండగా శుక్రవారం ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ష్పగీజా క్రికెట్ లీగ్‌లో భాగంగా పామిర్ జల్మీ, బ్యాండ్-ఎ-అమీర్ డ్రాగన్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది.
స్టాండ్స్‌లో కూర్చోని మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకుల మధ్య ఈ పేలుడు సంభవించింది. దీంతో ప్రేక్షకులు భయాందోళనలతో పరిగెత్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో చాలా మంది తీవ్ర గాయాల పాలైనట్లు సమాచారం. అదే విధంగా ఇరు జట్ల ఆటగాళ్లను బంకర్‌లోకి సురక్షితంగా అధికారులు తరలించారు. తాజా నివేదికల ప్రకారం.. ఈ ఘటన జరిగినప్పడు ఐక్యరాజ్యసమితి అధికారులు కూడా స్టేడియంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సంఘటనను కాబూల్ పోలీసు ప్రధాన కార్యాలయం అధికారికంగా ధృవీకరించింది. అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించలేదు. కాగా గత కొద్దిరోజులుగా కాబూల్‌లో వరుసగా బాంబు పేలుళ్లు జరుగుతున్న విషయం తెలిసిందే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Afghanistan | The Alokozay Kabul International Cricket Ground was rocked by a bomb blast during a Shpageeza Cricket League match. No casualties reported so far.#Afghanistan #Kabul #ShpageezaCricketLeague pic.twitter.com/LdBf533Y7P
— News18 (@CNNnews18) July 29, 2022
Bomb Blast pic.twitter.com/TpGZRfKY4s
— RVCJ Media (@RVCJ_FB) July 29, 2022
Afghanistan: Suicide blast rocks Kabul International cricket stadium during a T20 matchhttps://t.co/4n4cu7ciQg
— OpIndia.com (@OpIndia_com) July 30, 2022