బాలేశ్ ధన్కర్ పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. అతడు అత్యంత దారుణమైన కామాంధుడంటూ కోర్టు తేల్చేసింది. పదుల సంఖ్యలో మహిళలు, అమ్మాయిలతపై అతడు అత్యాచారం చేసినట్లు రుజువైంది.
అతడో సెక్స్ సైకో.. మహిళలను, అమ్మాయిలను టార్గెట్ చేసి అత్యాచారాలకు పాల్పడ్డాడు. వారికి మత్తు మందు ఇచ్చి అత్యంత పాశవికంగా అత్యాచారం చేశాడు. అత్యాచారం చేయటమే కాకుండా వాటిని వీడియోలు తీశాడు. చివరకు పాపం పండి పోలీసులకు చిక్కాడు. తాజాగా, ఈ కామాంధుడి నేరాలపై విచారణ జరిపిన కోర్టు.. అతడ్ని దోషిగా తేల్చింది. సిడ్నీ చరిత్రలో అత్యంత కామాంధుడిగా అతడ్ని పేర్కొంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన బాలేశ్ ధన్కర్ ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’లో మాజీ చీఫ్‌గా పని చేశాడు. భార్యతో గొడవల కారణంగా విడిపోయి వేరుగా ఉంటున్నాడు.
శృంగార సుఖానికి దూరం అయిన అతడు సెక్స్ సైకోగా మారాడు. అమ్మాయిలు, మహిళలను నమ్మించి తన ఇంటికి తీసుకువచ్చేవాడు. తర్వాత వారికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసేవాడు. దాన్నంతా వీడియో చిత్రీకరించేవాడు. అలారం క్లాక్‌లోని సీక్రెట్ కెమెరాల ద్వారా ఈ వీడియోలను తీసేవాడు. ఓ మహిళలపై అత్యాచారం చేసి, దాదాపు 95 నిమిషాల వీడియోను చిత్రీకరించాడు. 2018 జనవరి నుంచి అక్టోబర్ మధ్య కాలంలో 13 మందిపై అత్యాచారం చేశాడు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంటితో పాటు ఓ హోటల్ గదిలో సోదాలు జరిపారు.
అత్యాచారాల వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా, అతడ్ని కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ఐదుగురు కొరియన్ మహిళలకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేశాడు. వారికి డ్రగ్స్ ఎక్కించి దారుణంగా అత్యాచారం చేశాడు. వైవాహిక జీవితం సరిగా లేకపోవటంతోటే ఈ దారుణాలకు పాల్పడినట్లు నిందితుడు తెలిపాడు. ఒంటరితనం తనను ఇలాంటి పనులకు ప్రేరేపించిందని చెప్పాడు. మరి, సిడ్నీ చరిత్రలో అత్యంత కామాంధుడిగా పేరుగొంచిన బాలేశ్ ధన్కర్ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.